వచ్చే సీజన్లో.. ఆర్సిబి వారికి గుడ్ బై?
ఇంకా కొంత మంది ఆటగాళ్లు పేలవా ప్రదర్శన చేయడం రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఎంతో మైనస్ గా మారిపోయింది. ఇలాంటి ఆటగాళ్ళను రానున్న సీజన్లో బెంగళూరు జట్టు వదిలేసే అవకాశం ఉంది అని తెలుస్తూ ఉంది. అలాంటి వారిలో సిద్ధార్థ్ కౌశల్ ఒకరు. వేలంలో అతని 75 లక్షలకు కొనుగోలు చేసింది బెంగుళూరు యాజమాన్యం. ఈ ఏడాది ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. నాలుగు ఓవర్లు వేసి ఏకంగా 43 పరుగులు సమర్పించుకునీ ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో అతనికి వచ్చే ఏడాది ఉద్వాసన పలికే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇతనితో పాటు డేవిడ్ వీల్లీని కూడా బెంగళూరు జట్టు యాజమాన్యం వదులుకో పోతుంది అంటూ టాక్ వినిపిస్తోంది. 2 కోట్లకు వేలంలో అతని దక్కించుకుంది బెంగళూర్ యాజమాన్యం. ఆరంభ మ్యాచ్ లో మాక్స్ వెల్ అందుబాటులో లేకపోవటంతో అతనికి తుది జట్టులో చోటు దక్కింది. అయినా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. నాలుగు మ్యాచ్ లలో 18 పరుగులు మాత్రమే చేసి ఒక వికెట్ పడగొట్టాడూ. మ్యాక్స్ వెల్ వచ్చాక అతనికి ప్లేస్ కూడా దొరకలేదు. కరణ్ శర్మ సైతం ఉద్వాసన పలికే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇతనికి ఒక మ్యాచ్ లో కూడా తుది జట్టులో అవకాశం దక్కలేదు..