ఐపీఎల్ ఫైనల్.. ఆ షాట్ ఆడతాను అంటున్న రషీద్?
ఎందుకంటే ఎప్పటిలాగానే తన స్పీన్ బౌలింగ్ తో మాయ చేస్తున్న రషీద్ ఖాన్ అవసరమైనప్పుడు తన బ్యాట్ జులిపిస్తూ మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ వుండడం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే గుజరాత్ జట్టు విజయంలో కీలక పాత్ర వహిస్తున్నాడూ. అంతేకాదు గుజరాత్ టైటాన్స్ జట్టుకు వైస్ కెప్టెన్గా కూడా వ్యవహరిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. కాగా మొన్నటికి మొన్న ఒక మ్యాచ్లో రషీద్ ఖాన్ ఒక వింత షాట్ ఆడి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత ఆ షాట్ పేరేంటి అని అడగగా స్నేక్ షాట్ అంటూ చెప్పాడు. ఇక ఆ తర్వాత మరోసారి రషీద్ ఖాన్ అలాంటి షాట్ ఆడలేదు అని చెప్పాలి.
కానీ ఇప్పుడు ఫైనల్లో మాత్రం తప్పకుండా స్నేక్ షాట్ ఆడి తీరుతాను అంటూ చెబుతున్నాడు రషీద్ ఖాన్. నేడు గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ లో భాగంగా స్నేక్ షాట్ అనే కొత్త షాట్ ను పరిచయం చేసిన రషీద్ ఖాన్ ఇక ఈ షాట్ మళ్లీ ఆడాలంటూ అభిమానుల నుంచి చాలా అభ్యర్ధనలు వస్తున్నాయి అంటూ పేర్కొన్నాడు. కాగా నేడు జరగబోయే ఫైనల్ మ్యాచ్ లో ఒకవేళ బ్యాటింగ్ చేసే అవకాశం వస్తే అభిమానుల కోరిక మేరకు మరోసారి స్నేక్ షాట్ ఆడుతాను అంటూ చెబుతున్నాడు..