దినేష్ కార్తీక్ గురించి.. పాక్ మాజీ క్రికెటర్ ఏమన్నాడో తెలుసా?

praveen
నీ కెరీర్ ముగిసిపోయింది అంటూ అందరూ విమర్శలు చేస్తున్న వేళ అతను మాత్రం ఎక్కడా నిరాశ పడలేదు   నిజంగానే వయసు మీద పడింది. ఇక యువ ఆటగాళ్ల నుంచి పోటీ కూడా పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో నాకు టీమిండియాలో చోటు దక్కడం కష్టం అని అతను ఎప్పుడూ అనుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లో టీమిండియా లోకి రీఎంట్రీ ఇస్తాను అనే పట్టుదలతో ముందుకు సాగాడు. చివరికి అనుకున్నది సాధించాడు. అతను ఎవరో కాదు ఇండియా సీనియర్ బ్యాట్స్మెన్ దినేష్ కార్తీక్. ధోనీ రాకతో టీమిండియా జట్టులో ఇతని చోటు అది కష్టం గా మారిపోయింది. అడపాదడపా అవకాశాలు మాత్రమే అందుకున్నాడు. వచ్చిన అవకాశాల్లో కూడా తన ప్రతిభతో నిరూపించుకో లేకపోయాడు.

 ఇలాంటి సమయంలోనే ఇక యువ ఆటగాళ్ల పోటీ పెరగడంతో టీమిండియాకు దూరం అయ్యాడు. కానీ ఇటీవలే ఐపీఎల్లో మాత్రం అద్భుతంగా రాణించి భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే అతనిపై అందరూ ప్రశంసలు కురిపిస్తూ ఉండగా.. ఇటీవల పాకిస్థాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ కూడా స్పందించాడు. నేను సహజంగా ఇతర వ్యక్తుల వ్యక్తిగత విషయాల గురించి అస్సలు మాట్లాడను.. ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం చెప్పదలుచుకున్నాను.. దినేష్ కార్తీక్ జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాడు.

 అయినప్పటికీ అతడు ఎంతో బలంగా తిరిగి వచ్చాడు. తన జీవితంలో  ఏదో జరిగిందో నేను స్వతహాగా చదివి తెలుసుకున్నాను. అందుకే అతను తిరిగి వచ్చిన విధానం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఒకరకంగా అతడు ఎంతో గొప్పది అయిన పని చేశాడు అని చెప్పవచ్చు.. ఇక పరిపక్వత అంటే ఇదే నిదర్శనంగా చూపించవచ్చు.. నేను ఆడే రోజులనుంచి అతడు క్రికెట్ లో కొనసాగుతున్నాడు.. మానసికంగా శారీరకంగా చాలా దృఢంగా ఉన్నాడు. మంచి వారికి ఎప్పుడూ మంచి జరుగుతుంది అన్న దానికి దినేష్ కార్తీక్ టీమిండియా లోకి తిరిగి రావడమే నిదర్శనం.. ఇండియాలో అతను మళ్లీ ఎంపికవ్వడం ఎంతో గొప్ప విషయం.. అతనికి నా  అభినందనలు అంటూ షోయబ్ అత్తర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: