వావ్.. టీమిండియా కెప్టెన్గా హార్దిక్ పాండ్యా?

frame వావ్.. టీమిండియా కెప్టెన్గా హార్దిక్ పాండ్యా?

praveen
ప్రస్తుతం ఐపీఎల్ లో భాగంగా భారత క్రికెటర్లు అందరూ కూడా బిజీ బిజీగా ఉన్నారు అన్న విషయం తెలిసిందే. వివిధ జట్ల తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్ళు ఇక ఐపీఎల్ పోరులో హోరాహోరీగా తలపడుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఐపీఎల్ లో భాగంగా లీగ్ మ్యాచ్ లూ ముగింపు దశకు వచ్చాయి. ఆ  తర్వాత ఫైనల్ మ్యాచ్. ఈ నెలాఖరు వరకు ఐపీఎల్ ముగియనుంది. ఈ క్రమంలోనే అటు వెంటనే సౌత్ ఆఫ్రికా తో టీ20 సిరీస్ ఆడబోతుంది టీమిండియా. ఈ క్రమంలోనే ప్రస్తుతం అటు ఎంతో మంది యువ ఆటగాళ్లు ఐపీఎల్లో సత్తా చాటిన నేపథ్యంలో ఎవరికి టీమిండియాలో చోటు దక్కుతోంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.


 అయితే ఇప్పటికే సౌతాఫ్రికాతో టీమిండియా ఆడబోయే టీ20 సిరీస్ కి సంబంధించి ఇక షెడ్యూల్ అటు బీసీసీఐ ప్రకటించింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సౌతాఫ్రికాతో జరిగే టి20 సిరీస్ లో టీమిండియా అనూహ్యమైన మార్పులు చేయబోతుంది అన్నది తెలుస్తుంది. గత కొంతకాలం నుంచి నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్న భారత సీనియర్ ఆటగాళ్లకు రెస్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది. అదే సమయంలో ఈ ఏడాది ఐపిఎల్ లో సత్తా చాటిన యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇచ్చి  ఇక భారత జట్టు తరఫున ఆడించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.


 ఈ క్రమంలోనే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ, కె.ఎల్.రాహుల్, రిషబ్ పంత్, జస్ప్రిత్ బూమ్రా లకు రెస్ట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఒక వార్త వైరల్ గా మారిపోయింది. ఇంగ్లాండ్ తో మిగిలి ఉన్న ఒక టెస్ట్ కోసం వీరిని ఫ్రెష్ గా ఉంచేందుకు ఇక వీరికి రెస్ట్ ఇవ్వాలని బిసిసిఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే  హార్దిక్ పాండ్యా లేదా శిఖర్ ధావన్ లకు భారత జట్టుకు కెప్టెన్సీ అప్పగించే అవకాశం ఉందట. కాగా  ఐపీఎల్లో కెప్టెన్గా అదరగొడుతున్న హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: