నేను సెలెక్టర్ అయితే.. దినేష్ కార్తీక్ ని జట్టులోకి తీసుకుంటా?
గతంలో కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు కెప్టెన్గా కీలక ఆటగాడిగా కొనసాగిన దినేష్ కార్తీక్ ఈ ఏడాది మాత్రం రాయల్ చాలెంజ్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే జట్టులో కీలక ఆటగాడిగా దినేష్ కార్తీక్ అద్భుతం గా రాణిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్లో కూడా చివర్లో వచ్చి మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ జట్టుకు విజయాన్ని అందిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే అతడు టీమిండియా లోకి రావడం పక్కా అని కొంతమంది మాజీ క్రికెటర్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారూ అన్న విషయం తెలిసిందే.
ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కరోనా వైరస్ సమయంలో దినేష్ కార్తిక్ తో కలిసి క్వారంటైన్ లో ఉండగా జాతీయ జట్టులోకి రావాలని అతని పట్టుదలను కళ్లారా చూశాను అంటూ సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో దినేష్ కార్తీక్ అదిరిపోయే ప్రదర్శన చేస్తున్నాడని.. ఒకవేళ తాను సెలక్షన్ కమిటీ లో ఉండి ఉంటే తప్పకుండా దినేష్ కార్తీక్ ను టి20 వరల్డ్ కప్ కు ఎంపిక చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. బ్యాట్స్మెన్గా జట్టులోకి తీసుకుని కీపింగ్ కూడా అతనికి అప్పజెప్పాలని సూచించాడు..