
కోహ్లీకి చెప్పినట్లు.. రవి శాస్త్రి రోహిత్ కు చెప్పగలడా?
ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీకి ఎంతో సన్నిహితుడు అయిన టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఈ విషయంపై స్పందించాడు. కోహ్లీ రెండు మూడు నెలలు విశ్రాంతి తీసుకోవాలి అని సూచించాడు. దీంతో ఒత్తిడిని జయించి తిరిగి మళ్ళీ జట్టులోకి చేరినప్పుడు మునుపటిలా ఫామ్ లోకి వచ్చి అద్భుతంగా ఆడుతాడు అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇటీవల హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ మరోసారి డకౌట్ గా వెనుదిరిగాడు.. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ కి బ్రేక్ ఇవ్వాలి అనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ మ్యాచ్లో ప్రముఖ వ్యాఖ్యాత హర్ష భోగ్లే మాట్లాడుతూ విరాట్ కోహ్లీ గురించి రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశాడు.
ఈ క్రమంలోనే పక్కనే ఉన్న ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హేడెన్ స్పందిస్తూ రోహిత్ శర్మ కూడా ఈ సీజన్లో బాగా ఆడటంలేదు ఇలాంటప్పుడు విరాట్ కోహ్లీకీ సూచించినట్లు రావిశాస్త్రి అటు రోహిత్ శర్మ కు కూడా రెస్ట్ తీసుకోవాలని చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఎప్పుడు క్రికెట్ ఆడుతూ ఉంటారు. టోర్నమెంట్ జరుగుతూనే ఉంటాయి. ఆటగాళ్లు తమ మానసిక పరిస్థితులను అర్థం చేసుకుని ఆడుతూ ఉంటారు. ఈ విషయంలో కోహ్లీ మెరుగ్గా ఉన్నాడు. అతడు ఎంతో కాలం నుంచి దాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఏ ఆటగాడైనా సెలెక్టర్ వద్దకు వెళ్లినప్పుడు నేను ఆడను నన్ను ఎంపిక చేయకండి అని ఎవరు చెప్పరు. ఇక ప్రతి ఒక్కరు జట్టులో ఉండాలని కోరుకుంటారు కాని ఫామ్ లో లేనప్పుడు ఇబ్బందులు తప్పవు అంటూ చెప్పుకొచ్చాడు మ్యాధ్యు హెడెన్..