నేను ఆ టైప్ మనిషిని కాదు : బూమ్రా
నీ దగ్గరనుంచి ఇలాంటి ప్రదర్శన అస్సలు ఊహించలేదు అంటూ అభిమానులు సైతం ఆగ్రహంతో కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇలాంటి సమయంలోనే అనూహ్యంగా పుంజుకుని జస్ప్రిత్ బూమ్రా కోల్కతా నైట్రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. తన కెరీర్లోనే అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసి విమర్శకుల నోళ్లు మూయించాడు బుమ్రా. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు అంతే కాదు కీలకమైన ఐదు వికెట్లు పడగొట్టాడు. అయితే మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నప్పటికీ అటు జస్ప్రిత్ బూమ్రా చెలరేగిన విధానం మాత్రం అభిమానులలో ఆనందాన్ని నింపింది అని చెప్పవచ్చు.
ఈ క్రమంలోనే ఇటీవల జస్ప్రిత్ బూమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. తాను విమర్శలను ఎప్పుడూ లెక్కచేయలేదు అంటూ చెప్పుకొచ్చాడు. పూర్తిస్థాయిలో మేము సన్నద్ధమయ్యామూ.. ఫలితం ఏంటన్నది తర్వాత విషయం.. ఆడే విధానం పై అవగాహన ఉంటే ఎంతో సాఫీగా ముందుకు వెళ్లి పోవచ్చు. పరిస్థితులను అర్థం చేసుకుని అందుకు తగ్గట్టుగా బౌలింగ్ చేయాలి. నా వరకైతే నేను నా ప్రదర్శన పట్ల సంతృప్తి గానే ఉన్నాను. బయట వాళ్ళు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతారు. ఇక ఇతరుల మాటలు పట్టించుకుని నా ఆటను నేను జడ్ చేసుకునే టైప్ కాదు. వాళ్ళ మాటలు నన్ను ఏమాత్రం ప్రభావితం చేయవు అంటు జస్ప్రిత్ బూమ్రా చెప్పుకొచ్చాడు..