వావ్.. లక్నో అతిపెద్ద విజయం?
చివరికి కోల్కతా నైట్ రైడర్స్ జట్టు బ్యాటింగ్ లో పూర్తిగా విఫలం అయ్యింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. క్రీజులోకి వచ్చిన ఏ బ్యాట్స్ మెన్ కూడా కనీస ప్రదర్శన చేయలేక చేతులెత్తేసిన పరిస్థితి ఉంది. దీంతో ప్రత్యర్థి లక్నో తమ ముందు నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం కాదు కదా కనీసం పరుగులు చేయడానికి కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి.. దీంతో అతికష్టంమీద 101 పరుగులు చేసిన కోల్కతా నైట్రైడర్స్ జట్టు. చివరి కి ఆలౌట్ అయ్యింది. అయితే కోల్కతా నైట్ రైడర్స్ జట్టు లో ఎంతో మంది స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఒక్కరంటే ఒక్కరు కూడా బ్యాటింగ్ లో రాణించలేకపోయారు.
దీంతో ఏకంగా 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది లక్నో సూపర్ జెయింట్స్. ఇప్పటివరకు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో ఇదే అతిపెద్ద విజయం కావడం. కాగా ఐపీఎల్ లో భాగంగా ఇప్పటి వరకు అన్ని మ్యాచులు కూడా చివరి ఓవర్ వరకు కూడా ఎంతో ఉత్కంఠగా సాగాయి. కానీ లక్నో మ్యాచ్ మాత్రం మొదటి నుంచి విజయం లక్నో వైపు ఉంది అనేది ప్రేక్షకులకి స్పష్టంగా అర్థమయ్యే విధంగా సాగింది. చివరికి 75 పరుగులు తేడాతో ఘన విజయాన్ని అందుకున్న లక్నో జట్టు పాయింట్స్ టేబుల్ టాప్ లోకి దూసుకుపోయింది.