ఐపీఎల్ బెట్టింగ్.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు?

praveen
ఒక సాదాసీదా మధ్యతరగతి జీవితం గడుపుతున్న వ్యక్తి.. ఉద్యోగం తప్ప ఎలాంటి వ్యాపారాలు లేని వ్యక్తి.. వచ్చిన జీతం మొత్తం కుటుంబం సరిపోని వ్యక్తి.. ఏకంగా కోట్ల రూపాయల సంపాదించాలంటే అది సాధ్యమయ్యే పనేనా. సాధ్యం అవుతుంది కానీ కేవలం కలలో మాత్రమే. కానీ నిజజీవితంలో మధ్యతరగతి వాళ్లు కోట్ల రూపాయలు సంపాదించడం అంటే దాదాపు అసాధ్యం అని చెప్పాలి. అది కూడా ఉద్యోగం చేస్తూ కోట్ల రూపాయలు సంపాదించడం అస్సలు కుదరని పని. కానీ ఇటీవలి కాలంలో మాత్రం కొంత మంది సాదా సీదా మధ్యతరగతి జీవితం గడుపుతూనే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాత్రికి రాత్రే కోటీశ్వరుడుగా మారిపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.



 దీంతో ఇక ఈ ఘటన గురించి తెలిసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు అనే చెప్పాలి. లక్ష్మీదేవి కటాక్షం ఉంటే ఎలాగైనా అదృష్టం వరిస్తుంది అన్న దానికి ఇటీవల కాలంలో కోట్ల రూపాయలు సంపాదిస్తున్న వ్యక్తులు నిదర్శనంగా మారిపోతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇటీవలి కాలంలో ఇలా రాత్రికి రాత్రి కోట్ల రూపాయలు సంపాదించడం అంటే అది కేవలం లాటరీ ద్వారా మాత్రమే సాధ్యమయ్యే పని అని అందరూ అనుకుంటూ ఉంటారు. లేదా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా ఇలాంటివి సాధ్యమౌతుంది అని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఊహించని విధంగా రాత్రికి రాత్రే రెండు కోట్ల రూపాయలు సాధించాడు.


 ఇటీవలి కాలంలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ డ్రీమ్ 11 లో ఎంతోమంది బెట్టింగ్ పెడుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇందులో ఏకంగా రెండు కోట్లు గెలుచుకున్నాడు బీహార్కు చెందిన ఓ డ్రైవర్. దీంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడు గా మారిపోయాడు. శరణం జిల్లా రసూల్ పూర్ కు చెందిన రమేష్ ఇటీవల జరిగిన  పంజాబ్ లక్నో మ్యాచ్ పై 59 రూపాయల బెట్టింగ్ పెట్టాడు.  ఇక తెల్లవారేసరికి నెంబర్వన్ స్థానంలో నిలిచినట్లు సదరు వ్యక్తి చెప్పుకొచ్చాడు. అయితే ఇక జిఎస్టి అన్ని కట్ అయిన తర్వాత 1.4 కోట్ల రూపాయలు తన అకౌంట్లో జమ అయ్యాయి అంటూ చెప్పుకొచ్చాడు రమేష్. ఇక ఈ విషయం తెలిసి అందరూ అవాక్కవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: