సన్ రైజర్స్ కీ షాక్.. కీలక బౌలర్ దూరం?

praveen
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో ఓటమి తోనే ఇన్నింగ్స్ ఆరంభించింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. వరుసగా రెండు ఓటములతో అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది అనే చెప్పాలి. దీంతో ఇక సన్రైజర్స్ ఆట తీరు మారలేదు అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఆ తర్వాత మ్యాచ్ లలో మాత్రం అనూహ్యంగా పుంజుకుంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. వరుసగా ఐదు విజయాలు సాధించి ఒక్కసారిగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కి దూసుకుపోయింది. అయితే వరుసగా ఐదు విజయాలు సాధించి ఎంతో పటిష్టంగా కనిపించిన సన్రైజర్స్ హైదరాబాద్ కి ఇక ఇప్పుడు వరుస ఓటములు తప్పడం లేదు అని చెప్పాలి.



 వరుసగా రెండో ఓటమిని చవిచూసింది సన్రైజర్స్. అదే సమయంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును గాయాల బెడద కూడా ఎంతగానో వేధిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్ జట్టులో కీలక ఆల్రౌండర్ గా కొనసాగుతున్న వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా జట్టు నుంచి తప్పుకున్నాడు. సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఇక ఇప్పుడు మరో కీలక బౌలర్ కూడా గాయం కారణంగా ఐపీఎల్ మొత్తానికి దూరం కాబోతున్నాడు అన్నది తెలుస్తుంది. దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకి ఊహించని షాక్ తగిలింది.


 సన్రైజర్స్ హైదరాబాద్ నుంచి లెఫ్ట్ ఆర్మూర్ పేసర్ సౌరభ్ దూబే తప్పుకున్నాడు అన్నది తెలుస్తుంది. ఇప్పటికే గాయం కారణం  గా దూబే స్థానంలో సుశాంత్ మీశ్రా ఆడుతున్నాడు. అయితే సౌరబ్ దూబే ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదని.. అతనికి రెస్ట్ అవసరమని వైద్యులు సూచించడంతో ఇక ఐపీఎల్ లీగ్ నుంచి పూర్తిగా తప్పుకోవాల్సి వచ్చింది అన్నది తెలుస్తుంది. అయితే సౌరబ్ టోర్ని నుంచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరమని.. అతను త్వరగా కోలుకోవాలని అంటూ సన్రైజర్స్ హైదరాబాద్ కోచ్ టామ్ మూడి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు పెట్టాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: