ఐపీఎల్ : అతను భోజనం పెట్టగానే.. ఏడ్చేసాడట?
తమలో ప్రతిభ దాగి ఉంది అని ప్రపంచానికి చాటి చెప్పేందుకు ప్రతీ ఆటగాడికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఒక మంచి వేదికగా మారిపోయింది. ఇప్పుడు వరకు ఎంతో మంది ఆటగాళ్లు ఈ మెగా టోర్ని వేదిక గానే రాణించి ఆ తర్వాత అంతర్జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న వారు ఉన్నారు అని చెప్పాలి. ఇకపోతే ఇండియన్స్ జట్టులో స్పిన్నర్ గా బాగా రాణిస్తూ కీలక వికెట్లు పడగొడుతున్నాడు కుమార్ కార్తికేయ. తన ప్రతిభ ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నాడు. దీంతో ఇక కుమార్ కార్తికేయ ఎవరు అని అందరూ తెలుసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఈ క్రమంలోనే కుమార్ కార్తికేయ కోచ్ సంజయ్ భరద్వాజ్ అతడు ఎంత దీనమైన స్థితిలో నుంచి వచ్చాడు.. ఎలాంటి ఆటుపోట్లను ఎదుర్కొన్నాడూ అన్న విషయాన్ని గుర్తు చేసుకున్నాడూ. కుమార్ కార్తికేయ ఢిల్లీలోని తన అకాడమీలో శిక్షణలో చేరిన సమయంలో తొలిసారి వంట మనిషి వచ్చి భోజనం ఇవ్వగానే కార్తికేయ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అదేంటి అని ఆరా తీస్తే దాదాపు సంవత్సరం పాటు కార్తికేయ మధ్యాహ్న భోజనానికి దూరంగానే ఉంటున్నాడు అన్న విషయం తెలిసింది అంటూ కుమార్ కార్తికేయ గురించి సంజయ్ భరద్వాజ్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నెట్ బౌలర్ గా ఉన్న కుమార్ కార్తికేయను ఇక ఇటీవల 20 లక్షలకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.