"వార్నర్ క్లాస్... పావెల్ పవర్ హిట్టింగ్"... ఉమ్రాన్ మాలిక్ చిన్నబోయాడు ?
మరో అవకాశం దక్కించుకున్న ఢిల్లీ ఓపెనర్ మన్దీప్ సింగ్ మొదటి ఓవర్లోనే డక్ అవుట్ గా వెనుతిరిగాడు. ఇక ఆస్ట్రేలియా అల్ రౌండర్ మార్ష్ ఎందుకో పరుగులు చేయడానికి తడబడుతున్నాడు. దీనితో బాధ్యత అంతా వార్నర్ పై పడింది. పంత్ కూడా 26 పరుగులకే అవుట్ కావడంతో పావెల్ వచ్చాడు. ఇక ఇతని రాకతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఇద్దరూ బౌండరీలతో సన్ రైజర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా ఢిల్లీ ని సురక్షిత స్థాయికి చేర్చారు. అలా ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్ లలో 207 పరుగులు చేసి సన్ రైజర్స్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఢిల్లీ ఆటగాళ్లలో ఓపెనర్ వార్నర్ 92 పరుగులు చేసి తృటిలో సెంచరీని మిస్ చేసుకోగా, విండీస్ ఆల్ రౌండర్ పావెల్ (67 పరుగులు) అర్ద సెంచరీ సాధించాడు. మరి ఈ స్కోర్ ను సన్ రైజర్స్ ఛేదిస్తుందా ? లేదా ఢిల్లీ క్యాపిటల్స్ మరో విజయంతో ప్లే ఆప్స్ కు మరింత చేరువవుతుందా తెలియాల్సి ఉంది.