ఐపీఎల్ : చాప చుట్టేసిన ముంబై?

praveen
పాపం ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ కు ఈ సారి మాత్రం నిరాశే ఎదురైంది అని తెలుస్తోంది. ఐపీఎల్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ జట్టుగా పేరు సంపాదించుకున్న ముంబై ఇండియన్స్ జట్టుకు ఈసారి మాత్రం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. ఇండియా కెప్టెన్సీ చేపట్టిన తర్వాత సారథ్యంలో మరింత అనుభవం  సాధించిన రోహిత్ శర్మ ఈసారి ముంబై ఇండియన్స్ కు కప్ అందిస్తాడు అని అందరూ అనుకుంటూ ఉంటే అటు ముంబై మాత్రం ఊహించని రీతిలో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది.



 ఈ క్రమంలోనే ఇప్పటివరకు 9 మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ జట్టు కేవలం ఒకే ఒక మ్యాచ్లో విజయం సాధించింది. దీంతో అందరికంటే ముందుగానే అటు ఐపీఎల్ నుండి ప్లే ఆఫ్ చేరకుండానే నిష్క్రమించింది ముంబై ఇండియన్స్ జట్టు.  దీంతో అభిమానులు అందరూ కూడా నిరాశ లో మునిగిపోయాడు అని చెప్పాలి. చెన్నై సూపర్ కింగ్స్ కంటే ముంబై జట్టు కీ రన్ రేటు తక్కువగా ఉండటంతో చివరికి ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించక తప్ప లేదు అని చెప్పాలి. 9 మ్యాచ్ లు ఆడి ఒకే ఒక్క విజయం సాధించిన ముంబై ఇండియన్స్ జట్టుకు రన్రేట్ (-0.836) ఉంది.



 ఇకపోతే మరో ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ ఇటీవలే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లో జరిగిన మ్యాచ్లో ఓటమి చవిచూసింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ ఇకనుంచి ఆడబోయే ప్రతి మ్యాచ్లో కూడా తప్పనిసరిగా భారీ పరుగుల తేడాతో విజయం సాధించ వలసిన అవసరం ఉంది. ఇలా ఈ ఏడాది ఛాంపియన్ జట్లకు గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడం పై అటు ప్రేక్షకులు అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి. అదేసమయంలో ప్రస్తుతం ఐపీఎల్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ మాత్రం వరుస విజయాలతో టేబుల్ టాపర్ గా కొనసాగుతూ  ఉంది అన్న విషయం తెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: