హార్దిక్ పాండ్యాకు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చిన పంజాబ్ బౌలర్.. వీడియో వైరల్?

praveen
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా జరుగుతున్న సమయంలో బౌలర్లు కీలకమైన వికెట్లు పడగొట్టారు అంటే చాలు తమదైన శైలిలో సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. ఇలా కొన్ని కొన్ని సార్లు బౌలర్లు చేసుకునే సెలబ్రేషన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇటీవలే గుజరాత్ టైటాన్స్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఇలాంటి ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. హార్దిక్ పాండ్యా వికెట్ తీసిన సమయంలో బౌలర్ కాస్త వెరైటీగా సెలబ్రేషన్స్ చేసుకోవడం గమనార్హం.  ఐపీఎల్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది మ్యాచ్ లో ఎంతో ఆసక్తికరంగా మారింది.



 అయితే ఒక వైపు కెప్టెన్గా తనదైన వ్యూహాలతో జట్టుకు విజయాలు అందిస్తున్న హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్గా కూడా మంచి ప్రదర్శన కనబరుస్తూ ఫుల్ స్వింగ్ లో కనిపిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని గుజరాత్  టేబుల్ టాపర్ గా కొనసాగుతుంది అని చెప్పాలి. ఇక ఇలా ఫుల్ ఫామ్ లో ఉన్న హార్దిక్ పాండ్య  ఇటీవలే పంజాబ్ కింగ్స్  తో జరిగిన మ్యాచ్ లో మాత్రం నిరాశపరిచాడు. కేవలం ఒకే ఒక పరుగు చేసి రిషీ ధావన్ బౌలింగ్లో కీపర్ జితేష్ శర్మ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు హార్దిక్ పాండ్యా. ఇక ప్లాన్ ప్రకారమే రిషీ ధావన్ ఆఫ్ స్టంప్ అవతల బంతి వేసాడు. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా కట్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి మిస్ అయ్యి ఎడ్జ్ తీసుకుంది.



 చివరికి నేరుగా కీపర్ చేతుల్లోకి వెళ్లి క్యాచ్ పడింది. ఈ క్రమంలోనే ఫుల్ ఫామ్ లో ఉన్న హార్థిక్ పాండ్యా ను ఒకే ఒక పరుగుకు అవుట్ చేశాను అన్న ఆనందంలో బౌలర్ రిషి ధావన్ పెవిలియన్ వైపు వెళ్తున్న హార్దిక్ పాండ్యా కు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. ఇక అదే సమయంలో అటు డగౌట్ లో ఉన్న హార్దిక్ పాండ్య సతీమణి నటాషా.. పాండ్య వికెట్ కోల్పోవడంతో నిరాశలో కూరుకుపోయింది. దీనికి సంబంధించి వీడియో  ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది. హార్దిక్ పాండ్యా వికెట్ తీసి రిషి ధావన్ భలే సెలబ్రేట్ చేసుకున్నాడు అని పంజాబ్ కింగ్స్ జట్టు అభిమానులు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: