నటరాజన్ పై గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు?

praveen
టీ నటరాజన్.. భారత క్రికెట్ లో ఇతను ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఐపీఎల్లో అవకాశం దక్కించుకున్నాడు నటరాజన్ . ఇక మొదటి సీజన్ లోనే తన అద్భుతమైన బౌలింగ్ ప్రతిభతో  ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు. అంతే కాకుండా అటు సెలక్టర్ల చూపును కూడా ఆకర్షించాడు. దీంతో ఇక తక్కువ సమయంలోనే టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు అనే చెప్పాలి. ఇక ఆ తర్వాత ఒకే పర్యటనలో మూడు ఫార్మాట్లలో చోటు దక్కించుకుని సత్తా చాటాడు నటరాజన్. కానీ ఆ తర్వాత ఫిట్నెస్ సమస్యల కారణంగా గాయాల బెడద అతని వేధించింది.

 దీంతో టీమిండియాలో చోటు కోల్పోయాడు నటరాజన్. అటు గత ఏడాది ఐపీఎల్ సీజన్ లో కూడా పెద్దగా రాణించలేదు. ఈ ఏడాది మాత్రం అనూహ్యంగా పుంజుకున్న నటరాజన్  మంచి ప్రదర్శన చేస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. యార్కర్ లతో మరోసారి ప్రస్తుతం ఐపీఎల్ లో హాట్ టాపిక్ గా మారిపోయాడు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయంలో కీలకపాత్ర వహిస్తూ ఉన్నాడు. అంతే కాదు అంతకు ముందు కంటే ఎంతో ఫిట్ గా కనిపిస్తున్నాడు నటరాజన్. నటరాజన్ ప్రతిభ పై ఇటీవలే దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 2022 టీ20 ప్రపంచ కప్ టోర్నీలో పాల్గొనే భారత జట్టులో చోటు కోసం సన్రైజర్స్ పేసర్ నటరాజన్ కూడా ప్రస్తుతం పోటీ లో ఉన్నాడు అంటూ సునీల్ గవాస్కర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. యార్కర్ స్పెషలిస్టుగా పేరు సంపాదించుకున్న నటరాజన్ స్లో డెలివరీ లు వేయడంలో కూడా మంచి పట్టు సాధించాడు. ఐపీఎల్ సీజన్ లో స్లో డెలివరీ లతో బ్యాటర్లను తికమక పెడుతున్నాడు. దీంతో ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో అతని బౌలింగ్లో మరింత నాణ్యత కనిపిస్తోంది అని తెలిపాడు గవాస్కర్. ఇక ఈసారి టి20 వరల్డ్ కప్ లో అతనికి చోటు దక్కుతుందని మనసులో మాట బయట పెట్టాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: