రోహిత్ ఔట్.. రితికా ని ఓదార్చిన అశ్విన్ భార్య?

praveen
ఇటీవల ఐపీఎల్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి విఫలమయ్యాడు. దీంతో అభిమానులు అందరూ కూడా తీవ్ర నిరాశ లో మునిగిపోయారూ. అంతేకాదు ఇక మ్యాచ్ వీక్షించడానికి వచ్చిన రోహిత్ శర్మ సతీమణి కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. అదేంటి అంతకుముందు మ్యాచ్ లలో కూడా రోహిత్ శర్మ విఫలమయ్యాడు. ఇప్పుడు కొత్తగా ఇంతలా బాధ పడిపోవడం ఏంటి అని అనుకుంటున్నారు కదా ఇంతలా అభిమానులు ఫీల్ అవ్వడానికి కారణం నిన్న రోహిత్ శర్మ బర్త్ డే కావడమే.

 ఎన్నో రోజులనుంచి విఫలమవుతూ వస్తున్న రోహిత్ శర్మ తన పుట్టినరోజు నాడు మంచి ఇన్నింగ్స్ ఆడుతాడు అని అందరూ అనుకున్నారు. ముంబై ఇండియన్స్ కి మొదటి విజయాన్ని అందిస్తాడు అని భావించారూ. అయితే అందరూ అనుకున్నట్లు గానే ఈ ఐపీఎల్ సీజన్ లో మొదటి విజయాన్ని నమోదుచేసింది ముంబై ఇండియన్స్.  రోహిత్ శర్మ తన 35వ పుట్టినరోజున మళ్లీ పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచాడు. అభిమానులందరినీ కూడా బీహార్ చేస్తాడు అంతేకాదు ట్రాన్స్ లోహర్ట్ చేసాడు. అయితే రోహిత్ శర్మ సిక్సర్లు కొడుతూ ఉంటే తెగ ఎంజాయ్ చేద్దాం అని వచ్చిన రోహిత్ శర్మ సతీమణి రితిక శర్మ చాలా ఫీల్ అయింది.

 రోహిత్ శర్మ వికెట్ పడగానే అటు ఏడ్చినంత పని చేసింది. అశ్విన్ బౌలింగ్లో రోహిత్ శర్మ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు అనే విషయం తెలిసిందే  వికెట్ తీసిన ఆనందంలో రవిచంద్రన్ అశ్విన్ సెలబ్రేషన్ చేసుకున్నాడు  ఇది చూసిన అశ్విన్ భార్య ప్రీతి కూడా చప్పట్లు కొడుతూ అభినందించింది. పక్కనే రోహిత్ శర్మ భార్య రితికశర్మ బాధ పడుతూ ఉండడం చూసి పరిస్థితిని అర్థం చేసుకున్న అశ్విన్ భార్య ఆమె దగ్గరికి వెళ్లి ఓదార్చింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది. కాగా ఈ మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ను ఓడించింది ముంబై ఇండియన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: