తిరిగి ధోనికి కెప్టెన్సీ.. వీరేంద్ర సెహ్వాగ్ ఏమన్నాడో తెలుసా?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఇక ఈ సారి పేలవ ప్రదర్శన చేస్తోంది అన్న విషయం తెలిసిందే. ప్రతి ఏడాది పాయింట్ల పట్టిక లో టాప్ లో ఉండే చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది మాత్రం అతి తక్కువ విజయాలతో 9వ స్థానంలో కొనసాగుతూ వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బౌలింగ్ విభాగం బ్యాటింగ్ విభాగం పూర్తిగా విఫలం అయింది అన్న విషయం తెలిసిందే.. అయితే సరిగ్గా ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సినీ మహేంద్ర సింగ్ ధోనీ రవీంద్ర జడేజాకు అప్పగించాడు.


 ధోని వారసుడిగా పేరు సంపాదించుకున్న రవీంద్ర జడేజా కెప్టెన్సీలో అదరగొడతాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో చెన్నై సూపర్ కింగ్స్ విఫలమవుతూ వచ్చింది. ఒకవైపు కెప్టెన్ గా మరోవైపు ఆటగాడిగా కూడా అటు రవీంద్ర జడేజా పూర్తిగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలోనే ఇటీవల షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు రవీంద్ర జడేజా. కెప్టెన్సీ బాధ్యతలను   మళ్ళీ మహేంద్ర సింగ్ ధోనీకి అప్పగిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ధోని మళ్ళీ కెప్టెన్సీ చేపట్టడంపై ప్రస్తుతం అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


 ఈ క్రమంలోనే స్పందిస్తున్న ఎంతో మంది మాజీ క్రికెటర్లు ఇక ఇలా చెన్నై సూపర్ కింగ్స్ లో కెప్టెన్సీ విషయంలో గందరగోళం నెలకొనడంతో ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదే విషయంపై వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. జడేజాను కెప్టెన్గా నియమించిన నాటి నుంచి నేను ఈ విషయాన్ని చెబుతూ ఉన్నా.. ధోని కెప్టెన్ గా లేకపోతే చెన్నై జట్టుకు ఏది కలిసి రాదు ఆలస్యమైనా ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. ఇంకా చెన్నై జట్టుకు అవకాశం ఉంది. ఇక చెన్నై జట్టు ప్లే ఆఫ్ కి వెళ్ళడానికి కావలసినన్ని మ్యాచ్ లు కూడా మిగిలి ఉన్నాయి. ఇప్పుడు ధోనీ కెప్టెన్ గా మారిన తర్వాత పరిస్థితిలో మార్పు వస్తుంది అంటూ వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: