నా ఆటతో హ్యాపీగా ఉన్నా.. కానీ సంతృప్తి గా లేను?

praveen
బీసీసీఐ ప్రతి ఏడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అటు సీనియర్ ఆటగాళ్ల కి అనుభవాన్ని తెచ్చి పెడుతూ ఉంటే యువ ఆటగాళ్లకు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఒక మంచి ప్లాట్ ఫామ్ గా  మారిపోయింది అని చెప్పాలి   ఇటీవలి కాలంలో ఐపీఎల్లో రాణించిన గణాంకాలను బట్టి ఎంతో మంది ఆటగాళ్లు అంతర్జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఎంతో మంది యువ ఆటగాళ్లు ఐపీఎల్లో ఒక్కసారి రాణిస్తే చాలు ఇక టీమిండియాలో అవకాశం వచ్చేస్తుంది అని భావిస్తున్నారు. ఒకవేళ అదృష్టం కలిసి వచ్చి ఐపీఎల్ లో అవకాశం వచ్చింది అంటే వచ్చిన అవకాశాన్ని 100% ఉపయోగించుకుంటున్నారు.



 తమ ప్రతిభతో సత్తా చాటుతున్నారు అనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఐపీఎల్ లో ఎంతో మంది యువ బౌలర్లు అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. తమ ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉన్నారూ. ప్రస్తుతం సీనియర్ ఆటగాళ్లు సైతం పేలవ ప్రదర్శన చేస్తూ అభిమానులను నిరాశపరుస్తూన్న సమయంలో యువ ఆటగాళ్లు మాత్రం అదరగొడుతున్నారు. ఇలా ఐపీఎల్ లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న బౌలర్లలో పంజాబ్ కింగ్స్ పేసర్ అర్షదీప్ సింగ్ కూడా ఉన్నారు.


 కీలక సమయంలో వికెట్లు పడగొట్టాడు. ఇక పంజాబ్ కింగ్స్ జట్టులో డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా కూడా మారిపోయాడు అర్షదీప్. ఈ క్రమంలోనే ఇటీవల తన ప్రదర్శన పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నా ప్లాన్ ఎప్పుడూ మంచి ఏరియాలలో బౌలింగ్ చేయడమే.. అప్పుడే బ్యాట్స్మెన్లు  తప్పులు చేస్తారు. డెత్ ఓవర్లలో నేను పరిస్థితులకు సరళం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. నా ప్రదర్శన పట్ల ప్రస్తుతం సంతోషంగానే ఉన్నా.. కానీ ఎప్పుడూ సంతృప్తి చెందలేదు అంటూ అర్షదీప్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 7.70 ఎకనామిక్ తో అర్ష దీప్  తొమ్మిది మ్యాచ్ లలో మూడు వికెట్లు పడగొట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: