బర్త్ డే రోజు కూడా.. రో'హిట్' కొట్టలేకపోయాడు?
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మ ఎంత సక్సెస్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో 5 సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన కెప్టెన్ గా కొనసాగుతున్నాడు రోహిత్ శర్మ. అయితే ఈ ఏడాది మాత్రం ముంబై ఇండియన్స్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రోహిత్ శర్మపై విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. అదే సమయంలో జట్టుకు భారీ ఓపెనింగ్ స్పందించిఅందించి ఇక విజయంలో కీలక పాత్ర పోషించాల్సిన రోహిత్ శర్మ గత కొంత కాలం నుంచి పేలవమైన ఫామ్ కారణంగా పరుగులు చేయడానికి తెగ ఇబ్బందులు పడుతున్నాడు.
ఇకపోతే ఇటీవలే ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. కాగా నిన్న రోహిత్ శర్మ బర్త్ డే కావడంతో ఇక రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో రోహిత్ శర్మ చెలరేగి ఆడటం ఖాయం అని అభిమానులు అనుకున్నారు. భారీ అంచనాలు పెట్టుకున్నారు. దీపావళి రాకెట్ మాదిరిగా బౌండరీలు కొడతాడు అనుకున్నారు. కానీ ఐదు బంతుల్లో రెండు పరుగులు మాత్రమే చేసి వికెట్ చేర్చుకున్నాడు దీంతో ఫ్యాన్స్ తో పాటు స్టేడియంలోని స్టాండ్స్ లో ఉన్న రోహిత్ సతీమణి కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో ఇక బర్త్ డే రోజు కూడా హిట్ మాన్ హిట్టు కొట్టలేకపోయాడు అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు.