ఐపీఎల్ : గుర్తుపెట్టుకోండి.. రాత్రి 7:30 గంటలకు?

praveen
ఐపీఎల్ పోరు ఎంతో రసవత్తరంగా మారిపోయింది. సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా హోరాహోరీగా పోరాడుతున్నారు. కాగా నేడు ఆదివారం కావడంతో రెండు మ్యాచ్లు జరగబోతున్నాయి. మధ్యాహ్నం మూడున్నర గంటలకు లక్నో ఢిల్లీ మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఇక సాయంత్రం ఏడున్నర గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఈ క్రమంలోనే ఇక సన్రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగబోయే మ్యాచ్ పై అంచనాలు ఒక రేంజ్ లో  పెరిగిపోతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 ఐపీఎల్ హిస్టరీ లోనే ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది మాత్రం కేవలం ఇప్పటి వరకు రెండు విజయాలు మాత్రమే నమోదు చేసింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పేలవ ప్రదర్శనతో తీవ్ర ఇబ్బందులు పడుతుంది చెన్నై సూపర్ కింగ్స్. అయితే సరిగ్గా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకుని తన వారసుడైన జడేజాకు కెప్టెన్సీ అప్పగించాడు. కానీ రవీంద్ర జడేజా కెప్టెన్సీలో సక్సెస్ అవ్వలేక పోయాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల మళ్లీ కెప్టెన్సీని తిరిగి మహేంద్ర సింగ్ ధోనీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నాడు రవీంద్ర జడేజా.



 ఈ క్రమంలోనే నేడు జరగబోయే మ్యాచ్ ఎంతో రసవత్తరంగా మారిపోయింది. కాగా ఇప్పటి వరకు వరుసగా 5 విజయాలతో అదరగొట్టిన సన్రైజర్స్ ఇటీవలే గుజరాత్ లో జరిగిన మ్యాచ్లో ఓటమి చవిచూసింది. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్ లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ రెండు విజయాలు మాత్రమే సాధించింది. దీంతో నేడు సాయంత్రం ఏడున్నర గంటలకు జరగబోయే మ్యాచులు ధోని మళ్ళీ తన కెప్టెన్సీతో ఎలాంటి మాయ చేయబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ మ్యాచ్ కోసం అటు కేవలం చెన్నై అభిమానులు మాత్రమే కాదు మిగతా జట్ల అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: