నా ఆల్ టైం ప్లేయింగ్ ఎలెవన్ జట్టు ఇదే : మహమ్మద్ కైఫ్

praveen
ప్రస్తుతం ఐపీఎల్ పోరు ఎంతో రసవత్తరంగా సాగుతోంది. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. ప్లే ఆఫ్ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్ కూడా ఊహించిన దానికంటే రసవత్తరంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐపీఎల్ లో ఏ జట్టు ఎలా రాణిస్తోంది అన్న విషయంపై అటు మాజీ క్రికెటర్లు ఎప్పటికప్పుడు తమ విశ్లేషణలు సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఐపీఎల్లో ఏ ఆటగాడు అద్భుతంగా రాణిస్తున్నాడు అన్న విషయాన్ని కూడా చెబుతున్నారు మాజీ ఆటగాళ్లు.


 ఈ క్రమంలోనే ఐపీఎల్లో తమకు బెస్ట్ ఆల్ టైం ప్లేయింగ్ ఎలవెన్ జట్టు ఏంటి అన్నది కూడా సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తున్నారు. భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన ప్లేయింగ్ ఎలెవెన్ జట్టును ప్రకటించాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల టీమిండియా మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ ఐపీఎల్ లో తన ఆల్ టైం ప్లేయింగ్ ఎలెవెన్ జట్టును ప్రకటించారు. మహమ్మద్ ప్రకటించిన ఆల్టైమ్ ప్లేయింగ్ ఎలెవన్ జట్టుకు మహేంద్ర సింగ్ ధోనీని కెప్టెన్గా ఎంచుకోవడం గమనార్హం  అంతేకాకుండా తన జట్టు లో ఐదుగురు విదేశీ ఆటగాళ్లకు కూడా చోటు కల్పించాడు మహమ్మద్ కైఫ్.


 కాగా టీం ఇండియా మాజీ ఆటగాడు మహమ్మద్ ఖాన్ ఎంచుకున్న తన ఆల్ టైం ప్లేయింగ్ ఎలెవన్ జట్టు వివరాలు ఇలా ఉన్నాయి. క్రిస్ గేల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ,సురేష్ రైనా,ఏబీ డివిలియర్స్, ధోని, రస్సెల్, రషీద్ఖాన్, సునీల్ నరైన్,మలింగా బుమ్రా లకు చోటు కల్పించాడు అనే చెప్పాలి. అయితే మహమ్మద్ ఖాన్ ప్రకటించిన ఆల్ టైం ప్లేయింగ్ ఎలెవన్ జట్టు లో అటు పలువురు ప్రముఖ భారత క్రికెటర్లకు చోటు దక్కకపోవడం గమనార్హం. అయితే గతంలో హర్భజన్ సింగ్ ఎంచుకున్న ప్లేయింగ్ ఎలెవెన్ జట్టులో కూడా మహేంద్ర సింగ్ ధోనీకి కెప్టెన్సీ అప్పగించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: