కోహ్లీ నాలిగింతలు కష్ట పడతాడూ : యువరాజ్

praveen
ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్  ఎంతో రసవత్తరంగా సాగుతుంది.. ప్రతి ఒక్కరూ టీవీలకు అతుక్కుపోయి మరి మ్యాచ్ వీక్షిస్తూ  ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నది మాత్రం విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్ గురించి అని చెప్పాలి. ఎందుకంటే గతంలో అద్భుతమైన ఫామ్ లో కొనసాగి ఒంటిచేత్తో టీమిండియాకు విజయాన్ని అందించిన విరాట్ కోహ్లీ ఇప్పుడు మాత్రం రోజురోజుకూ ఐపీఎల్ బెంగళూరు జట్టుకు భారంగా మారిపోతున్నాడు. విరాట్ కోహ్లీ బెంగళూరు జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు.. కెప్టెన్గా కూడా వ్యవహరించాడు అన్న కారణాలతో తప్ప.. అచ్చం విరాట్ కోహ్లీ లాగే ఇంకొక ఆటగాడు పేలవమైన ఫామ్ కొనసాగిస్తే అతన్ని ఇప్పటికే ఫ్రాంచైజీ పక్కనపెట్టేది అన్నది అందరికీ తెలిసిన నిజం.

 ప్రతి మ్యాచ్ లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతున్న విరాట్ కోహ్లీ ఎందుకో అనవసరమైన షాట్స్ ఆడి వికెట్ చేజార్చుకుంటున్నాడు. అంతేకాకుండా ఇక విరాట్ కోహ్లీ ఆఫ్ స్టంప్ బలహీనతను గుర్తించిన బౌలర్లు ఇక అదే తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఇక విరాట్ వికెట్ తీసుకుంటూ ఉండటం గమనార్హం. ప్రస్తుతం వరల్డ్ క్లాస్ పెయిర్గా పేరు సంపాదించుకున్న విరాట్ కోహ్లీ చివరకు ఆడిన 9 మ్యాచ్ లలో కేవలం 128 మాత్రమే చేశాడు అంటే ఇక విరాట్ కోహ్లీ ఎంత పేలవమైన ఫామ్ లో కొనసాగుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ ఫామ్ పై మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ స్పందించాడు.

 ఈ క్రమంలోనే ఇటీవలే ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత పదిహేనేళ్లలో విరాట్ కోహ్లీ లాగ కష్టపడే ఆటగాడిని నేను చూడలేదు అంటూ యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు. కోహ్లీ ఇప్పుడూ తన ప్రదర్శన తో సంతృప్తిగా లేడూ. ఇతరులు కూడా అతని విషయంలో సంతోషంగా లేరు. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఎంత పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుంటాడో మనం కళ్ళారా చూశాము. సెంచరీల మీద సెంచరీలు కొట్టే వాడూ. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ఎంత గొప్ప క్రికెటర్ అయినా అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు కోహ్లీ తిరిగి రాణించాలంటే ఇంతకుముందులా  స్వేచ్ఛగా ఆడాలి. తనని తాను మార్చుకుని  అతడెంటో మళ్లీ చూపించగలడూ అంటు యువరాజ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: