అతనిలో ధోని లక్షణాలు ఉన్నాయి : యువరాజ్

praveen
భారత క్రికెట్లోకి మహేంద్రసింగ్ ధోని వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు రిషబ్ పంత్. అచ్చం ధోని లాగే వికెట్ కీపర్ గా ఉండడమే కాదు. అతను మిడిలార్డర్లో అద్భుతమైన ఆటగాడిగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు. కానీ ఆ తర్వాత కొంతకాలం పేలవా మైన ఫామ్ తో జట్టుకు దూరమయ్యాడు. కానీ అనూహ్యంగా పుంజుకుని ఇప్పుడు మాత్రం టీమ్ ఇండియా లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు రిషబ్ పంత్. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్లో కూడా అద్భుతంగా రాణిస్తూ ఉన్నాడు. టీమిండియా ఏ ఫార్మాట్లో మ్యాచ్ ఆడిన అందులో రిషబ్ పంత్ మాత్రం తప్పకుండా ఉంటున్నాడు.



 ఇకపోతే ఇక అటు ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్గా ఎంపికైన రిషబ్ పంత్ ఇక కెప్టెన్సీలో కూడా ఎంతో సమర్థవంతంగానే నిర్వహిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఢిల్లీ జట్టుకు వరుస విజయాలు అందించడంలో కీలకపాత్ర వహిస్తూ ఉన్నాడు. అదే సమయంలో ఒక బ్యాట్స్మెన్గా కూడా జట్టు భారీ స్కోరు అందించడంలో రిషబ్ పంత్ అదరగొడుతున్నాడు అని చెప్పాలి. అయితే ఇప్పటికే రిషబ్ పంత్ కెప్టెన్సీపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు స్పందించి ప్రశంసలు కురిపించారు అన్న విషయం తెలిసిందే. ఇటీవలే భారత మాజీ ఆటగాడూ సిక్సర్ల వీరుడిగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న యువరాజ్ సింగ్ కూడా ఇదే విషయంపై స్పందించాడు.



 వికెట్ కీపర్లు వికెట్ల వెనకాల ఉండి జట్టు పరిస్థితులను అర్థం చేసుకుంటూ టీం మొత్తానికి అద్భుతంగా ముందుకు నడిపించగలరని  ఇందుకు సరైన ఉదాహరణ అంటూ చెప్పుకొచ్చాడు. అటు యువ ఆటగాడు రిషబ్ పంత్ లో కూడా ఈ లక్షణాలు చాలా ఉన్నాయి అని తెలిపాడు.  క్రీడా ఛానల్ ఇంటర్వ్యూలో యువరాజ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. వయసురీత్యా యువరాజ్ సింగ్ ఎక్కువ కాలం టెస్ట్ కెప్టెన్ గా కొనసాగలేడూ అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు యువరాజ్ సింగ్.  రిషబ్ పంత్  ను వైస్ కెప్టెన్ గా నియమించి  అతనికి ఫ్యూచర్ కెప్టెన్గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది అని తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: