హార్దిక్ పాండ్యా గుజరాత్ ను గెలిపిస్తాడా ?
కానీ ఆఖరి ఓవర్ లో శశాంక్ సింగ్ చెలరేగడంతో ఈ స్కోర్ తో సరిపెట్టుకుంది. ముందుగా ఈ స్కోర్ కు అభిషేక్ శర్మ మరియు మార్ క్రామ్ లు అర్ద సెంచరీలు చేసి గట్టి పునాది వేశారు. మరోసారి కెప్టెన్ విలియమ్సన్ ఫెయిల్ అయ్యాడు. పూరన్ భారీ షాట్ ఆడబోయి అవుట్ అయ్యాడు. అనూహ్యంగా శశాంక్ సింగ్ కేవలం 6 బంతుల్లో 3 సిక్సర్లు మరియు ఒక ఫోర్ తో 25 పరుగులు చేసి జట్టుకు విలువైన స్కోర్ ను అందించాడు. అయితే ఇప్పుడు గుజరాత్ కు ఈ స్కోర్ అంతా సులభం కాదు. ఇప్పటికీ ఈ మ్యాచ్ లో ఫేవరెట్ సన్ రైజర్స్ అని చెప్పాలి.
ఒకవేళ ఈ మ్యాచ్ లో గుజరాత్ గెలవాలంటే శుబ్ మాన్ గిల్ మరియు హార్దిక్ పాండ్యాలు రాణిస్తేనే వీలు అవుతుంది. ఎందుకంటే సన్ రైజర్స్ కు ఉన్న బౌలింగ్ లైన్ అప్ ను తట్టుకుని ఈ స్కోర్ ను ఛేదించడం అంత సులభం కాదు. మరి గుజరాత్ ను హార్దిక్ పాండ్య గెలిపిస్తాడా చూడాలి.