ఐపీఎల్ 15 టైటిల్ "సన్ రైజర్స్ హైదరాబాద్" దే ?

VAMSI
ఐపీఎల్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 15 సంవత్సరాలు పూర్తి అయింది. ఐపీఎల్ టైటిల్ ను ఎలాగయినా కొట్టాలని ఇప్పటి వరకు 10 జట్లు పోటీ పడ్డాయి. కానీ వీరిలో కొన్ని జట్లు మాత్రమే ఈ ఆశను నెరవేర్చుకున్నాయి. వాటిలో చెన్నై, ముంబై, కోల్కతా, హైదరాబాద్, రాజస్థాన్ జట్లు ఉన్నాయి. ఇక పాతవి కాకుండా ప్రస్తుతం కొనసాగుతున్న జట్లలో పంజాబ్, బెంగుళూరు, ఢిల్లీ జట్లకు ఇంకా అందని ద్రాక్షలా మిగిలింది. అయితే ప్రస్తుతం మ్యాచ్ లు జరుగుతున్న తీరు మరియు అన్ని జట్ల ప్రదర్శనను సరిగా పరిశీలిస్తే ఈ సారి కూడా ఈ జట్లకు నిరాశ తప్పేలా లేదని తెలుస్తోంది. ఐపీఎల్ చరిత్రలో హైదరాబాద్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ గా పేరు మార్చుకున్న తర్వాత ఒక్క సారి మాత్రమే డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ లో ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకుంది.

అయితే మరోసారి ఈ జట్టు ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకోనుందని తెలుస్తోంది. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. గత ఐపీఎల్ లో దారుణంగా విఫలం అయిన తర్వాత యాజమాన్యం బాగా నిరాశ చెందింది. అందుకే ఈ సీజన్ లో మొదటి రెండు మ్యాచ్ లలో ఓడినా ఆ తర్వాత నుండి తమ తప్పులను తెలుసుకుని ప్రత్యర్థులను వరుసగా చిత్తు చేస్తూ మళ్ళీ టైటిల్ కొట్టే సత్తా మాలో తగ్గలేదని నిరూపిస్తోంది. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్ లో అభిషేక్ శర్మ, త్రిపాఠి, మార్ క్రామ్, పూరన్ లు ఫామ్ లో ఉండడం బాగా కలిసొచ్చే అంశం అని చెప్పాలి. ఇక బౌలింగ్ అంటే వేరే చెప్పాల్సింది లేదు. యువకులతో కూడిన బౌలింగ్ లైన్ అప్ ను చూస్తేనే ప్రత్యర్థులకు వణుకు పుడుతుంది.

భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్, జాన్సెన్ లతో అద్భుతంగా ఉంది. ఎటువంటి బలమైన బ్యాటింగ్ లైన్ అప్ ఉన్న టీమ్ కైనా చెమటలు పట్టించగలదు. ఇక ఒక టీమ్ టైటిల్ గెలవడానికి ఇంతకన్నా టీమ్ ఉంటుందా. అందుకే ఐపీఎల్ సీజన్ 15 ను గెలుచుకోబోయే జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ అన్ని ఫిక్స్ అయిపోండి. మరి అంచనాలు పెట్టుకున్నట్టే టైటిల్ రెండవసారి సాధిస్తుందా అన్నది చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: