మా కెప్టెన్ కు.. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ కూడా రాదు?

praveen
ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఛాంపియన్ జట్లుగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ప్రతి మ్యాచ్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగడం చివరికి పేలవ ప్రదర్శనతో ఓటమి చవి చూడటం జరుగుతూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. దీంతో ఇదిగో గెలుస్తుంది అదిగొ గెలుస్తుంది అని ఎదురు చూసిన అభిమానులు అందరికీ కూడా ప్రస్తుతం ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. వరుసగా ఓటమిలు చవి చూస్తూ అభిమానులను నిరాశ పరుస్తున్నా తమ అభిమాన జట్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు అభిమానులు. ఇకపోతే ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ మరో దారుణమైన పరాజయాన్ని చవిచూసింది.


 ఇటీవలే పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆఖరి వరకు పోరాటం సాగించినప్పటికీ చివరికి 11 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. కాగా ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్ లలో ఇది ఆరు ఓటమి కావడం గమనార్హం. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ కి ఇక ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతయ్యాయి అని చెప్పాలి. మరీ ముఖ్యంగా అటు కెప్టెన్గా జట్టును ముందుకు నడిపించడమే కాదు ఒక స్టార్ ఆల్రౌండర్గా అద్భుతంగా రాణించాల్సిన రవీంద్ర జడేజా ప్రతి మ్యాచ్లో తేలిపోతు ఉన్నాడు అంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడు ఒక మామూలు ఆటగాడిగా ఉంటేనే బాగా రాణించగలడు. కెప్టెన్సీ భారం అతడిపై స్పష్టంగా కనిపిస్తోంది అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.


 కెప్టెన్సీ అప్పగించిన తర్వాత బౌలింగ్ బ్యాటింగ్ ఫీల్డింగ్ లో కూడా రవీంద్ర జడేజా బాగా రాణించలేక పోతున్నాడు అంటూ నిరాశ చెందుతున్నారు అభిమానులు. ఇక దీనికి సంబంధించిన మీమ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే  భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల నష్టానికి నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులు మాత్రమే చేసి చివరికి ఓటమి చవి చూసింది అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: