రిషబ్ పంత్ షాక్.. ఎంత జరిమాన పడిందో తెలుసా?

praveen
నిన్నటివరకూ ఐపీఎల్లో  ఆ ఆటగాడు అలా రాణించాడు.. ఈ ఆటగాడు బాగా ప్రదర్శన చేశాడు అంటూ ఏదో ఒకటి చర్చించుకునేవారు. ఇక ఇప్పుడు మాత్రం ఒకే విషయం గురించి చర్చించుకుంటున్నారు. అదే నిన్న రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్లో అంపైర్ నో బాల్ ప్రకటించలేదని రిషబ్ పంత్ ప్రవర్తించిన తీరు గురించి. క్రీడా స్పూర్తికి విరుద్ధంగా రిషబ్ పంత్ ప్రవర్తించాడు అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మాజీ క్రికెటర్లు. ఇక ఇది ప్రపంచ క్రికెట్లో ఏ మాత్రం మంచిది కాదు అంటూ హెచ్చరిస్తూ ఉండటం గమనార్హం. అయితే రిషబ్ పంత్ అంపైర్ నిర్ణయం పై అసంతృప్తి వ్యక్తం చేసిన తీరు తో అతనికి జరిమానా పడటం ఖాయం అని అనుకున్నారు అందరు.


 చివరికి అనుకున్నట్లుగానే జరిగింది అన్నది తెలుస్తుంది. అంపైర్ నిర్ణయం పై అనవసర రాద్ధాంతం చేసిన రిషబ్ పంత్  చివరికి మూల్యం చెల్లించుకున్నాడు. అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించడమే కాదు ఫీల్డులో ఉన్న ఆటగాళ్లను రీకాల్ చేయడంపై కన్నెర్ర చేసిన ఐపీఎల్ యాజమాన్యం రిషబ్ పంత్ తో పాటు అతనికి మద్దతుగా నిలిచిన శార్దూల్ ఠాకూర్ అసిస్టెంట్ ప్రవీన్ ఆమ్రే లపై కూడా  చర్యలు  తీసుకుంది. ఈక్రమంలోనే రిషబ్ పంత్ కు లభించే ఇక 100% మ్యాచ్ ఫీజులో కోత విధించింది. అంతేకాకుండా రిషబ్ పంత్ కు మద్దతుగా నిలుస్తూ అంపైర్ నిర్ణయాన్ని  తప్పుబడుతూ హడావిడి చేసిన ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ కి కూడా షాక్ ఇచ్చారు ఐపీఎల్ నిర్వాహకులు.


 శార్దూల్ ఠాకూర్ కి ఏకంగా 50 శాతం మ్యాచ్ ఫీజులో కోత విధించడం గమనార్హం. అయితే మ్యాచ్ మధ్యలో ఫీల్డ్ లోకి వెళ్లి అంపైర్ల తో వాగ్వాదానికి దిగినందుకుగాను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రే పై ఒక మ్యాచ్లో 100 శాతం ఫీజు జరిమానాతో పాటు ఒక మ్యాచ్ పై నిషేధం కూడా విధించారు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ను అతిక్రమించినందుకుగాను ఈ ముగ్గురు పై చర్యలు తీసుకుంటున్నట్లు మ్యాచ్ రిఫరీ డేనియల్ మనోహర్ వెల్లడించారు. కాగా ఈ మ్యాచ్లో 15 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయం సాధించింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: