ఐపీఎల్ : అసలు ఏం జరుగుతుంది.. కన్ఫ్యూజన్లో ఫ్యాన్స్?
ప్రతి మ్యాచ్ లో కూడా భారీగా పరుగులు చేస్తూ అదరగొడుతున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. యువ ప్రతిభ తెర మీదికి రావడం కూడా మంచి విషయమే. కానీ అసలు స్టార్ క్రికెటర్లకు ఏమైంది ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, రోహిత్ శర్మ ఇలా చెప్పుకుంటూ పోతే స్టార్ క్రికెటర్లందరు కూడా ప్రస్తుతం సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమవుతున్న పరిస్థితి. కొన్నిసార్లు గోల్డెన్ డకౌట్ గా కూడా పెవిలియన్ చేరుతున్నారు. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో రికార్డులను కొల్లగొట్టిన ఆటగాళ్లకు ఇప్పుడు ఐపీఎల్ సీజన్ లో ఏమైంది అన్నది అందరిలో నెలకొన్న ప్రశ్న.
అంతేకాదండోయ్ స్టార్ బౌలర్లు అని చెప్పుకునే వారు కూడా ఈసారి భారీగా పరుగులు సమర్పించుకుంటూ చెత్త రికార్డులు నమోదు చేస్తూ ఉన్నారు. ఇక మరోవైపు ఐపీఎల్ హిస్టరీ లోనే బెస్ట్ ఫీలర్లు అని చెప్పుకునే వారు సైతం వరుసగా క్యాచ్లు వదిలేస్తూ ఉండడం గమనార్హం. ఇంకోవైపు ఐపీఎల్ హిస్టరీలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ లుగా ఉన్న వారు తమ జట్లకు సరైన విజయాలు అందించలేకపోతున్నారు. దీంతో ఇక ఈ ఏడాది ఐపీఎల్ తో కన్ఫ్యూజన్ లో మునిగి పోతున్నారు ప్రేక్షకులు. ఈ ఐపీఎల్ సీజన్ పై కాస్త అసంతృప్తితోనే ఉన్నట్లు తెలుస్తోంది..