పోలార్డ్ కాళ్ళు మొక్కిన బ్రావో.. వైరల్ వీడియో?
ఇటీవలే ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది అనే విషయం తెలిసిందే. ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్ జట్టు చివరికి ఓటమి చవిచూసింది. ఈ క్రమంలోనే వెస్టిండీస్ ఆల్ రౌండర్ ముంబై ఇండియన్ హిట్టింగ్ బ్యాట్స్ మ్యాన్ కిరణ్ పోలార్డ్ బ్యాటింగ్ ప్రాక్టీస్ వెళ్తున్న సమయంలో చెన్నై సూపర్ కింగ్ స్టార్ ఆల్రౌండర్ బ్రావో కాళ్ళకి దండం పెట్టాడు. ఇద్దరు నవ్వుతూ ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.
అయితే కిరణ్ పోలార్డ్ ఇటీవలి వెస్టిండీస్ జట్టు కెప్టెన్ కీరన్ పోలార్డ్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపాడు. అయితే కిరణ్ పోలార్డ్ తో పాటు ద్వేన్ బ్రావో కూడా వెస్టిండీస్ జట్టుకు ఎన్నో ఏళ్ల నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈ ఇద్దరు కూడా మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే. కాగా మైదానంలో ఇద్దరూ కలిసి ప్రేక్షకులను ఆకర్షించారు. ఇప్పుడు ఏకంగా పోలార్డ్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించడంతో బ్రావో పొలార్డ్ కాళ్లకు పట్టుకున్నాడు అన్నది తెలుస్తుంది.