రోహిత్ చెత్త రికార్డ్.. ఐపీఎల్ లో ఏకైక ప్లేయర్?
మరీ ముఖ్యంగా టీమిండియా కెప్టెన్సీ చేపట్టిన తర్వాత ఇప్పటివరకు రోహిత్ శర్మ నుంచి ఒక సాలిడ్ ఇన్నింగ్స్ రాలేదు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా పూర్తిగా విఫలం అవుతున్నాడు రోహిత్ శర్మ. ఒకవైపు జట్టుకు విజయాలు అందించకపోవడమె కాదు.. బ్యాటింగ్ లో కూడా పేలవమైన ప్రదర్శన కారణంగా జట్టుకు భారంగా నే మారిపోతున్నాడు. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ ఐపీఎల్ లో ఆడిన 7 మ్యాచ్ లలో అన్నింటిలో కూడా ఓడిపోయింది అని చెప్పాలి. దీంతో ఇక అభిమానులందరికీ కూడా నిరాశే ఎదురైంది.
అయితే చెన్నై తో జరిగిన మ్యాచ్ లో చావో రేవో తేల్చుకోవాల్సిన సమయంలో బాగా రాణించాల్సింది పోయి డకౌట్ గా వెనుదిరిగాడు రోహిత్ శర్మ. అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు. ఈ క్రమంలోనే ఒక చెత్త రికార్డును కూడా ఖాతాలో వేసుకున్నాడు. చెన్నై తో జరిగిన మ్యాచ్ లో డకౌట్ గా వెనుదిరిగిన రోహిత్ శర్మ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు డక్ అవుట్ అయిన ప్లేయర్ గా చెత్త రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఇక రోహిత్ తర్వాత స్థానంలో పియూష్ చావ్లా హర్భజన్, పార్థివ్ పటేల్,మన్దీప్ సింగ్,రహానే, అంబటి రాయుడు13 డకౌట్ లతో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు..