ముంబై ఇండియన్స్ ఓటమి.. ఇక గోవింద గోవిందా?

praveen
ముంబై ఇండియన్స్.. ఈ జట్టు పేరు చెబితే చాలు ప్రత్యర్థి ఆటగాళ్లు వణికి పోతూ ఉంటారు.  ప్రత్యర్థి ఎవరైనా సరే విజయం మాత్రం ముంబై ఇండియన్స్ దే అని క్రికెట్ ప్రేక్షకులు కూడా నమ్ముతూ ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మెగా వేలం కారణంగా జట్టులో కీలక ఆటగాళ్లు గా ఉన్నవారు జట్టుకు దూరమయ్యారూ. ఇక కొత్త ఆటగాళ్లు జట్టులోకి రావడం తో సమన్వయ లోపం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. అయితే టీమిండియా కెప్టెన్ గా మారిపోయి కెప్టెన్సీలో మరింత అనుభవం సంపాదించిన రోహిత్ శర్మ ఎందుకో ముంబై జట్టును ఈసారి సమర్థవంతంగా ముందుకు నడిపించే లేకపోతున్నాడు.


 ఈ క్రమంలోనే వరుస ఓటములతో సతమతమవుతూ ఉంది ముంబై ఇండియన్స్ జట్టు. ఇప్పుడు వరకు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేక పోయింది అని చెప్పాలి. ఈ సీజన్లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ జట్టు అన్నింట్లో కూడా ఓడిపోయింది. దీంతో మొన్నటివరకు ముంబై గెలుస్తుంది. మళ్లీ పుంజుకుంటుంది. ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంటుంది అంటూ ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు ఇక ఇప్పుడు మాత్రం ముంబై ఏడో ఓటమి తర్వాత గోవింద గోవింద అని అంటున్నారు.


 ఈ సీజన్ దేవుడికి ఇచ్చేశాం ఇక వచ్చే సీజన్లో చూసుకుందాం అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమితో ముంబై ఇండియన్స్ కి ప్లే ఆఫ్  అవకాశాలు పూర్తిగా కనుమరుగు అయ్యాయి. ఇక వరుసగా మ్యాచ్ లలో ముంబై ఇండియన్స్ గెలిచినా ప్లే ఆఫ్ చేరుకోలేదు. అయితే ఇప్పుడు ముంబై ఫామ్ చూస్తే వరుసగా గెలవడం కూడా కష్టం అని చెప్పాలి. అందుకే అభిమానులు అందరూ కూడా గోవిందా గోవిందా అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: