వైరల్ : బూతులు తిట్టిన శ్రేయస్ అయ్యర్?
ఏం జరిగిందంటే.. ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ కోల్కతా నైట్రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగే ఒక బ్లాక్ బస్టర్ మూవీ ని తలపించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో చివరికి రాజస్థాన్ రాయల్స్ జట్టు ఏడు పరుగుల తేడాతో విజయం సాధించి ఊపిరిపీల్చుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ఇక ఇదే మ్యాచ్ లో బట్లర్ సెంచరీతో అదరగొట్టాడు. ఇక అనంతరం భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగింది కోల్కత నైట్ రైడర్స్ జట్టు.
ఒకానొక సమయంలో ఇక కోల్కతా విజయం సాధించడం ఖాయం అనే విధంగానే కనిపించింది. శ్రేయస్ అయ్యర్ 85 పరుగులతో రాణించాడు. ఫించ్ 58 పరుగులు చేశాడూ. ఆ తర్వాత చాహల్ తన స్పిన్ బౌలింగ్ తో మాయ చేసాడు. ఒకే ఓవర్ లో హ్యాట్రిక్ సాధించడమే కాదు మొత్తంగా నాలుగు వికెట్లు సాధించాడు. మ్యాచ్ మొత్తంలో 5 వికెట్లు సాధించి రాజస్థాన్ గెలుపు లో ప్రముఖ పాత్ర వహించాడు. అయితే 16 వ ఓవర్ వేసాడు బౌల్ట్. ఇక ఆఖరి బత్తిని వెంకటేష్ మిడ్ ఆన్ దిశలో ఆడాడు. ఇద్దరు పరుగు పూర్తి చేశారు. అయితే శ్రేయస్ అయ్యర్ రెండో పెరుగు కోసం సగం వరకు వచ్చాడు. కానీ పరుగు రాదు అని గ్రహించిన వెంకటేష్ వెంటనే వెనక్కి వెళ్లాలంటూ హెచ్చరించడంతో ఇక సరైన సమయంలో క్రీజులోకి చేరుకున్న శ్రేయస్ అయ్యర్ వికెట్ దక్కించుకున్నాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన శ్రేయస్ అయ్యర్ రన్ కోసం ఎందుకు రాలేదో చెప్పాలంటూ సహచర ఆటగాడు వెంకటేష్ ను చెడామడా తిట్టేశాడు. అయితే అక్కడ పరుగు ఎలా వస్తుందో చెప్పాలంటూ కౌంటర్ ఇచ్చాడు వెంకటేష్. దీంతో కాసేపు డగౌట్ కాసేపు హీట్ ఎక్కింది..