అతని బ్యాటింగ్ చూశాక.. మళ్ళీ క్రికెట్ ఆడాలని ఉంది : ఎబి డివిలియర్స్

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది.. అయితే  ఐపీఎల్ లో అతి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన జట్టుగా కొనసాగుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటి వరకు జరిగిన 14 సీజన్లలో ఒక్కసారి కూడా కప్పు గెలిచిన దాఖలాలు లేవు. కానీ ఈసారి మాత్రం ఆర్సిబి దూకుడు చూస్తుంటే కప్పు కొట్టడం పక్క అన్నది అర్ధమవుతుంది. ఒకప్పుడు కేవలం కోహ్లీ బ్యాటింగ్ మీద మాత్రమే ఆధారపడిన బెంగళూరు జట్టుకు.. ఇక ఇప్పుడు కోహ్లీ పెద్దగా రాణించలేక పోయినా నష్టమేమీ కలగడం లేదు. బెంగళూరు జట్టు లో ఉన్న ఎంతో మంది ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మరిముఖ్యంగా ప్రతి మ్యాచ్ లో దినేష్ కార్తీక్ ఇస్తున్న ఫినిషింగ్ టచ్ అయితే అద్భుతం అని చెప్పాలి.

 తన అనుభవాన్ని అంతా రంగరించి ఇక ఫినిషింగ్ టచ్ ఇస్తూ భారీగా పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించడంలో సక్సెస్ అవుతున్నాడు దినేష్ కార్తీక్. సీనియర్ క్రికెటర్ అని ముద్ర పడిపోయిన దినేష్ కార్తీక్ ఇంకా తన ఆటలో కసి మాత్రం తగ్గలేదు అని నిరూపిస్తూ ఉన్నాడు. అంతేకాదు ప్రస్తుతం ఐపీఎల్ లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే దినేష్ కార్తీక్ ప్రదర్శనపై బెంగుళూరు మాజీ ఆటగాడు ఏపీ డివిలియర్స్ స్పందించాడు. దినేష్ కార్తీక్ ఆటను చూస్తూ ఉంటే నాకు మళ్ళీ బ్యాట్ పట్టుకొని మైదానంలోకి దిగాలి అనిపిస్తోంది అంటూ చెప్పుకొచ్చాడు.

 ఇటీవలే బెంగుళూరు లక్నో మధ్య జరిగిన మ్యాచ్ కు ముందు వీయు స్పోర్ట్స్ స్ట్రీమింగ్ తో ఎబి డివిలియర్స్ మాట్లాడుతూ ఐపీఎల్ లో దినేష్ కార్తీక్ బ్యాటింగ్ చూసి షాక్ అయ్యాను. గత కొన్ని నెలలుగా అతను క్రికెట్ ఎక్స్పోజర్ అనుకున్నాను. ఐపీఎల్ ముందు అతను ఇంగ్లాండులో వ్యాఖ్యాతగా కనిపించాడు. దీంతో అతన్ని చూస్తే ఇక కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించే స్టేజ్ లో ఉన్నాడని భావించా.. కానీ గతంలో కంటే దినేష్ కార్తీక్ ఈ సీజన్లో సూపర్ ఫామ్లో కొనసాగుతున్నాడు. అతను సమర్థుడైన ఆటగాడని ఎప్పటి నుంచో తెలుసు.. అధిక ఒత్తిడిని అదుపు చేయగల సత్తా కూడా అతని సొంతం. జాతీయ జట్టులో చోటు దక్కకపోవడం తోనే అతను దేశవాళీ క్రికెట్లో పెద్దగా రాణించలేకపోయాడు. అతని ఆటతీరు  ఆశ్చర్యం వేసింది.  కార్తీక్ 360 డిగ్రీ ప్లేయర్ అంటూ డివిలియర్స్ కొనియాడాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: