
అదే నా లక్ష్యం.. మనసులో మాట బయపెట్టిన దినేష్ కార్తీక్?
కోల్కతా జట్టు ను వదిలి బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న దినేష్ కార్తీక్ ప్రతి మ్యాచ్లో కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. ఇటీవల ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో కూడా 34 బంతుల్లో 66 పరుగులు చేసి కష్టాల్లో ఉన్న బెంగళూరు జట్టును గట్టెక్కించాడు. అనంతరం మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తో ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు దినేష్ కార్తిక్. తన గోల్స్ ఏంటి అన్న విషయాలను ఇక ఇంటర్వ్యూ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. బెంగళూరు జట్టును గెలిపించినందుకు నీకు ధన్యవాదాలు.. 2013 నుంచి ఇదే అత్యుత్తమ ప్రదర్శన ఇలా రాణించడానికి ఎలా సన్నద్ధమయ్యావ్ అంటూ విరాట్ కోహ్లీ ప్రశ్నించాడు.
నాకు స్వల్పకాలిక దీర్ఘకాలిక లక్ష్యాలు ఉన్నాయి. స్వల్పకాలిక లక్ష్యమైతే బెంగళూరును గెలిపించటం.. ఇక నన్ను వేలంలో తీసుకున్నప్పుడు ఫినిషర్ పాత్ర కోసమే నిన్ను జట్టులోకి తీసుకున్నాము అంటు జట్టు యాజమాన్యం చెప్పడంతో నాకు కూడా ఇదే కావాలి అని అనుకున్నాను.. దీర్ఘకాలిక లక్ష్యం విషయానికి వస్తే టీమ్ ఇండియాకు ప్రపంచ కప్ అందించడం అంటూ చెప్పుకొచ్చాడు. ఈసారి జరిగే టి20 ప్రపంచకప్ జట్టులో ఉండాలనుకుంటున్నా అంటూ మనసులో మాట బయట పెట్టేసాడు. ప్రతిరోజు నాలో ఉన్న అత్యుత్తమ ఆటగాడని బయటకు తెచ్చేందుకు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను అంటు దినేష్ కార్తీక్ తెలిపాడూ. బెంగళూరు జట్టు తరఫున రాణిస్తూ ఉండటం ఎంతో సంతోషంగా ఉంది అంటూ తెలిపాడు..