ధోని కొత్త అవతారం.. అభిమానులు ఫిదా?
అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్గా కొనసాగుతూన్నాడు. అయితే ఇటీవలే సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోనీ తప్పుకోవడంతో ఇక జడేజా సారథ్య బాధ్యతలను స్వీకరించాడు. ప్రస్తుతం జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న మహేంద్ర సింగ్ ధోనీ జట్టులో ఉన్న యువ ఆటగాళ్లు అందరూ క్రికెట్లో రాటుదేలే విధంగా ఎంతగానో ట్రైనింగ్ కూడా ఇస్తున్నాడు మహేంద్రసింగ్ ధోని. ఇటీవలే ధోని కి సంబంధించిన ఒక వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ స్పిన్నర్ అవతారమెత్తాడు. చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ సెషన్ లో భాగంగా లెగ్ స్పిన్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు మహేంద్రసింగ్ ధోని. ఈ వీడియోని చెన్నై సూపర్ కింగ్స్ యజమాన్యం తన అధికారిక సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. దీంతో ఇక ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ధోనీ ఐపీఎల్ లో బౌలింగ్ వేస్తే చూడాలని ఉంది అంటూ ఈ వీడియో చూసిన తర్వాత అభిమానులు అందరూ కూడా కామెంట్లు పెడుతున్నారు అని చెప్పాలి. కాగా గతంలో టీమిండియా తరఫున ఆడినప్పుడు మహేంద్రసింగ్ ధోని బౌలింగ్ చేసిన విషయం తెలిసిందే..