అతను ఫ్యూచర్ స్టార్.. టీమిండియా లోకి తీసుకోండి?

praveen
ఐపీఎల్ అంటేనే యువ ఆటగాళ్ల ప్రతిభకు పెట్టింది పేరు. ఎంతో మంది యువ ఆటగాళ్లు అంతర్జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడం కోసం ఐపిఎల్ లో అద్భుతంగా రాణిస్తూ ఉంటారు. ఐపీఎల్ టీమ్ లో కూడా ఎంతో మంది యువ ప్లేయర్స్ తెరమీదికి వస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ సారి కూడా  ఎంతో మంది ఆన్ క్యాప్డ్ ప్లేయర్ తెర మీదికి వచ్చి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇలాంటివారిలో హైదరాబాద్ బ్యాట్స్మన్ రాహుల్ త్రిపాఠి కూడా ఒకరు అని చెప్పాలి. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఆడుతున్న రాహుల్ త్రిపాఠీ అద్భుతమైన ఫామ్ లో అదరగొడుతున్నాడు. ప్రతి మ్యాచ్లో కూడా భారీగా పరుగులు చేస్తున్నాడు.


 ఇటీవలే కోల్కతా నైట్రైడర్స్ లో జరిగిన మ్యాచ్లో 37 బంతుల్లో 71 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే రాహుల్ త్రిపాఠీ అద్భుతమైన బ్యాటింగ్ తీరుపై ప్రస్తుతం అందరి ప్రశంసలు కురిపిస్తున్నారు. మాజీ క్రికెటర్లు సైతం స్పందిస్తూ అతనిలో ఎంతో ప్రతిభ దాగి ఉంది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక అభిమానులు సైతం ఇండియా తరపున ఆడేందుకు అతడు అర్హుడు అని  అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఐపీఎల్ ముగిసిన తర్వాత అతన్ని భారత జట్టులోకి ఎంపిక చేయాలి అంటు డిమాండ్ చేస్తూ ఉన్నారు.


 రాహుల్ త్రిపాఠీ ఒక అద్భుతమైన క్రికెటర్ సెలెక్టర్లు అతని ఆటతీరు పరిగణలోకి తీసుకోవాలి. వీలైనంత త్వరగా అతడిని భారత జట్టులో చూడాలని అనుకుంటున్నాను అంటూ ఒక నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కాగా ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడిన రాహుల్ త్రిపాఠి  కీలక సమయంలో రాణిస్తూ 171 పరుగులు సాధించాడు. హైదరాబాద్ జట్టు హ్యాట్రిక్ విజయాలు సాధించడంలో రాహుల్ త్రిపాఠి పాత్ర ఎంతో కీలకమైనది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల కోల్కతా నైట్రైడర్స్ పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. అయితే తక్కువ రన్రేట్ ఉన్న కారణంగా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో కొనసాగుతుంది హైదరాబాద్ జట్టు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: