ఐపీఎల్ : హమ్మయ్య.. అందరూ సేఫ్?
ఆటగాళ్ళు కోచ్ ల దగ్గర నుంచి వారి సిబ్బంది వరకు కూడా ప్రతి ఒక్కరిని క్వారంటైన్ లో ఉంచుతూనే ఐపీఎల్ నిర్వహించడానికి సిద్ధమవుతోంది అన్న విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ కాపిటల్ జట్టు ఫిజియో ప్యాట్రిక్ పర్హట్ వైరస్ బారిన పడటం సంచలనంగా మారిపోయింది. దీంతో ఇక జట్టులో ఉన్న మిగతా సభ్యులకు కూడా వైరస్ సోకే ప్రమాదం ఉందని అభిమానులు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ సభ్యులకే కాదు అభిమానులందరికీ కూడా ఊరట కలిగించే వార్త తెలిసింది.
కరోనా వైరస్ బారిన పడిన ఫిజీయో పర్హట్ తో సన్నిహితంగా ఉన్న వారితో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ బృందం సభ్యులందరికీ కూడా జరిగిన కరోనా పరీక్షలు నెగిటివ్ రిపోర్టులు వచ్చినట్లు ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం తెలిపింది. పర్హట్ నుంచి వైరస్ ఎవరికి వ్యాపించగా ప్రస్తుతానికి ఆటగాళ్లందరూ కూడా క్షేమంగా ఉన్నారని.. అయితే మరోసారి వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం చెప్పడం గమనార్హం. అయితే కరోనా వైరస్ బారిన పడిన పర్హట్ లో ఎలాంటి లక్షణాలు కూడా లేవని అయినప్పటికీ అతని వైద్య పర్యవేక్షణలో ఉంచినట్లు తెలుస్తోంది.
అయితే ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం సైతం పరోక్షంగా ధ్రువీకరించడం గమనార్హం. నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తో జరగబోయే పోవడానికి సిద్ధంగా ఉన్నాం అంటు ఒక పోస్టు పెట్టింది. ఏది ఏమైనా ప్రస్తుతం ప్రతి ఒక్కరిని బయో బబుల్ లో ఉంచుతూ కఠిన నిబంధనల మధ్య మ్యాచ్ నిర్వహిస్తూ ఉన్నప్పటికీ కూడా ఇక వైరస్ ఎలా ప్రవేశిస్తుంది అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే బిసిసీఐ అధికారులు దీనిపై విచారణ చేసే అవకాశం కూడా ఉందని కొంతమంది భావిస్తున్నారు..