గాయంతో దూరం అవడం పై.. దీపక్ చాహర్ ఏమన్నాడో తెలుసా?

praveen
ఇటీవలి కాలంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఎన్నో జట్లకు గాయాల బెడద వేధిస్తోంది అన్న విషయం తెలిసిందే. విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగించాలి అనుకున్న అనే జట్లలో కూడా వరుసగా కీలక ఆటగాళ్లు దూరం అవుతూ ఉండటం సంచలనంగా మారిపోతుంది. ఈ క్రమంలోనే ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ కీలక ఆల్రౌండర్ దీపక్ చాహర్ గాయం బారినపడి జట్టుకు దూరమయ్యాడు. మొదట కేవలం రెండు మ్యాచ్ లకు మాత్రమే అతను దూరమవుతాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత మాత్రం ఇక గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో సీజన్ మొత్తానికి దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే.


 ఐపీఎల్ సీజన్ కి దూరం అయ్యాడు కానీ ఆ తర్వాత జరగబోయే టి20 వరల్డ్ కప్ కి మాత్రం టీమిండియాకు దీపక్ చాహర్ అందుబాటులోకి వస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ అది కూడా కుదిరేలా కనిపించడం లేదు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే అతని గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఏకంగా నాలుగు నెలల పాటు అతనికి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా వేదికగా నవంబర్ నెలలో జరగబోయే టి20 వరల్డ్ కప్ లో కూడా దీపక్ చాహర్ అందుబాటులో ఉండటం కష్టంగానే కనిపిస్తోంది.


 ఈ క్రమంలోనే గాయం కారణంగా అటు ఐపీఎల్ కి దూరం కావడంతో ఇటీవల దీపక్ చాహర్ స్పందించాడు. దురదృష్టవశాత్తు గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరం అయ్యాను. నేను ఆడాలి అనుకున్నాను కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు. గతంలో మాదిరిగానే ఇంకా బలంగా ఎంతో బెటర్ గా తిరిగి వస్తాను మీ అందరూ నా పైన చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు  అంటు ఇటీవల దీపక్ చాహర్ సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చాడు. ఇక గెట్ వెల్ సూన్ అంటూ అభిమానులు కామెంట్ పెడుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: