ఆరోన్ ఫించ్ అరుదైన రికార్డ్.. ఐపీఎల్ లో ఒకేఒక్కడు?

praveen
ప్రతి ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తూ ఎన్నో రికార్డులను కొల్ల గొడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కొంత మంది బ్యాటింగ్లో రికార్డులు కొల్లగొడితే కొంత మంది బౌలింగ్ లో రికార్డులు సాధిస్తూ ఉంటారు. కానీ కొంత మంది ఆటగాళ్లు మాత్రం కేవలం మ్యాచ్ లు ఆడడం తోనే రికార్డులు కొల్ల గొడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ఆరోన్ ఫించ్ ఇలాంటి ఒక అరుదైన రికార్డును సాధించాడు.


 అద్భుతమైన బ్యాటింగ్తో లేకపోతే బౌలింగ్ లో ఎన్నో వికెట్లు పడగొట్టి రికార్డులు సృష్టించ లేదు. ఎక్కువ జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఆటగాడిగా అరుదైన రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. ఇలా ఐపీఎల్లో ఈ రికార్డు సాధించిన  తొలి విదేశీ ఆటగాడిగా ఆరోన్ ఫించ్ అరుదైన  రికార్డును ఖాతా లో వేసుకున్నాడు. ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తో  జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టు తరఫున బరిలోకి దిగాడు ఆరోన్ ఫించ్. కాగా ఈ స్టార్ ప్లేయర్ ఇప్పటి వరకు ఐపీఎల్ లో ఏకం గా తొమ్మిది వికెట్లకు ప్రాతినిధ్యం వహించిన ప్లేయర్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు అని చెప్పాలి.


 ఇలా ఇప్పటి వరకు ఏ జట్లకు ఆరోన్ ఫించ్ ప్రాతినిధ్యం వహించాడు అన్న వివరాలు చూసుకుంటే.. రాజస్తాన్‌ రాయల్స్‌ (2010), ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ (2011–2012), పుణే వారియర్స్‌ (2013), సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (2014), ముంబై ఇండియన్స్‌ (2015), గుజరాత్‌ లయన్స్‌ (2016, 2017), కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ (2018), రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (2020) జట్లకు ఆడాడు. ఫించ్‌ తర్వాత ఈ జాబితా లో దినేశ్‌ కార్తీక్, మనీశ్‌ పాండే, ఇషాంత్‌ శర్మ, పార్థివ్‌ పటేల్‌ ఆరు జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లు గా రెండో స్థానం లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: