
సన్రైజర్స్ తరఫున.. ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడు ఎవరో తెలుసా?
హ్యాట్రిక్ విజయాలు సాధించిన నేపథ్యంలో ఇప్పుడు వరకు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాళ్లు ఎవరు అన్నది మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. మరి ఇప్పుడు వరకు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాళ్లు వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎంతగానో అవమానించి చివరికి జట్టునుంచి వదిలేసుకున్న సన్రైజర్స్ మాజీ కెప్టెన్ ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా టాప్ లో కొనసాగుతూ ఉన్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున నాలుగు వేల 14 పరుగులు చేశాడు డేవిడ్ వార్నర్.
ఇక ఒకప్పుడు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడి ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మారి ఇక ఇప్పుడు పంజాబ్ జట్టు లో కొనసాగుతున్న శిఖర్ ధావన్ సన్రైజర్స్ తరఫున ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా జట్టులో ఉన్నాడు శిఖర్ ధావన్. ఇప్పటివరకు 2518 పరుగులు చేశారు. సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 2009 పరుగులతో మూడవ స్థానంలో ఉన్నాడు.మనీష్ పాండే 1345 పరుగులతో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్ స్టార్ ఓపెనర్ జానీ బెయిర్ స్ట్రో 1038 పరుగులతో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా 5వ స్థానంలో ఉండటం గమనార్హం .