గుర్రం ఫోటో పోస్ట్ చేస్తూ.. మాజీ క్రికెటర్ ఆసక్తికర కామెంట్?
కానీ ఆ తర్వాత మాత్రం అనూహ్యంగా పుంజుకుని గుజరాత్ టైటన్స్ ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఏకంగా 37 పరుగుల తేడాతో ఓడిపోవడం పై టీమిండియా మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే టీమిండియా సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఇదే విషయంపై స్పందిస్తూ తన దైన శైలిలో సెటైర్లు వేశాడు. రాజస్థాన్ రాయల్స్ ప్రదర్శన పై స్పందించిన అమిత్ మిశ్రా ఒక గుర్రం కార్టూన్స్ షేర్ చేశాడు.. ఈ సందర్భంగా కామెంట్ కూడా జత చేశాడు.
తొలి ఆరు ఓవర్లలో బలమైన గుర్రం లా కనిపించింది రాజస్థాన్ రాయల్స్ జట్టు. చివరి 14 ఓవర్లలో ఎంతో బలహీనంగా తయారయింది అని అర్థం వచ్చే విధంగా ఇటీవల టీమిండియా సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రా షేర్ చేసిన ఫోటోలో అర్ధం ఉంది అని చెప్పాలి. ఇటీవలే గుజరాతి టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ 37 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమిత్ మిశ్రా ఇలాంటి పోస్టు పెట్టాడు అన్నది తెలుస్తూ ఉంది. ఏదేమైనా ప్రస్తుతం ఈ సీనియర్ స్పిన్నర్ పెట్టిన పోస్టు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.