కోహ్లీ సూపర్ హ్యూమన్ : షేన్ వాట్సన్

praveen
ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ క్రికెటర్లలో అటు విరాట్ కోహ్లీ  ఒకడిగా  కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. కేవలం భారత్ క్రికెట్లోనే కాదు ప్రపంచ క్రికెట్లో కూడా విరాట్ కోహ్లీ ఇప్పటికీ ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. విరాట్ కోహ్లీ మైదానంలోకి దిగాడు అంటే చాలు బౌలర్ల వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. అంతలా తన ఆటతీరుతో అదరగొడుతు ఉంటాడు విరాట్ కోహ్లీ. అందుకే విరాట్ కోహ్లీకి బౌలింగ్ చేయాలంటేనే బౌలర్లు వణికి పోతూ ఉంటారు అని చెప్పాలి. విరాట్ కోహ్లీ గత కొంత కాలం నుంచి మాత్రం పెద్ద స్కోర్ చేయడం లేదు.

 ప్రతిసారి భారీ అంచనాల మధ్య విరాట్ కోహ్లీ బరిలోకి దిగినప్పటికీ ఎందుకో తక్కువ స్కోరుకే చివరికి వికెట్ కోల్పోతున్న పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో విరాట్ కోహ్లీ మంచి స్కోరు చేయగలుగుతాడా లేదా మళ్లీ ఫామ్ లోకి వస్తాడా లేదా అని అభిమానులు అందరూ కూడా నిరాశ చెందుతున్నారు. అయితే కొన్ని మ్యాచులలో మెరుపులు మెరిపించినట్లు కనిపించినప్పటికీ ఆ మెరుపులు కేవలం ఒకే మ్యాచ్ కు పరిమితమవుతున్నాయి. ముఖ్యంగా విరాట్ కోహ్లీ సెంచరీ చేసి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తయిపోతుంది అని చెప్పాలి. విరాట్ కోహ్లీ పై కొంత మంది విమర్శలు చేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి.

 ఇక ఇలాంటి నేపథ్యంలోనే ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ షైన్ వాట్సాప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడూ. గత కొన్ని నెలలుగా మంచి స్కోర్ చేయక పోయినప్పటికీ టెస్ట్ క్రికెట్ లో ఉన్న టాప్ 5 ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ నెంబర్ వన్ స్థానంలో ఉంటాడు  అంటూ ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ వాట్సన్ చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ సూపర్ హ్యూమన్ లాంటి వాడని ఇక క్రికెట్ మ్యాచ్ ఆడటానికి వెళ్లిన ప్రతిసారీ కూడా ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తాడని అంతే కాకుండా భారీ పరుగులు చేయాలనే పట్టుదలతో ఉంటాడని షేన్ వాట్సన్ చెప్పుకొచ్చాడు. సెంచరీ చేయలేకపోవడానికి పెద్దగా కారణాలు అవసరం లేదు అని తెలిపాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: