రోహిత్ కెప్టెన్సీ అతనికి ఇచ్చేయ్ : సంజయ్ మంజ్రేకర్

praveen
బీసీసీఐ ప్రతియేడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు రోహిత్ శర్మ. సచిన్ టెండూల్కర్ దగ్గర నుంచి ముంబై ఇండియన్స్ సారధ్య బాధ్యతలను అందుకున్న రోహిత్ శర్మ.. కేవలం తక్కువ సమయంలోనే ఐదు సార్లు ముంబై ఇండియన్స్ జట్టును చాంపియన్గా నిలిపాడు. ఇప్పటివరకు కూడా ఏ జట్టు ఐపీఎల్ లో ఐదు సార్లు టైటిల్ గెలిచిన దాఖలాలు లేవు. ఇలా హిస్టరీ క్రియేట్ చేసిన కెప్టెన్ గా కొనసాగుతున్నాడు రోహిత్ శర్మ. అయితే గత సీజన్ వరకు కూడా టీమిండియా జట్టులో కీలక ఓపెనర్ గా వైస్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా కొనసాగాడు.


 అయితే ఇక ఇటీవలే అనూహ్య పరిణామాల మధ్య విరాట్ కోహ్లీ నుంచి మూడు ఫార్మాట్లకు సంబంధించిన కెప్టెన్సీ కూడా అందుకున్నాడు రోహిత్ శర్మ. టీమిండియాను తన కెప్టెన్సీలో ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు. ఇప్పుడు వరకు రోహిత్ శర్మ కెప్టెన్సీ లో టీమిండియా ఆడిన ప్రతీ మ్యాచ్లో కూడా గెలిచింది. ఇకపోతే టీమిండియా కెప్టెన్గా సారథ్యంలో మరింత అనుభవం సాధించిన రోహిత్ కి ఇక ఇప్పుడు ఐపీఎల్లో తిరుగు ఉండదు అని అందరూ అనుకున్నారు. కానీ అభిమానుల అంచనాలు మొత్తం తారుమారు అయ్యాయి. మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ కాస్త ఇక ఇప్పుడు ముంబై ఇండియన్స్ను సమర్ధవంతంగా నడిపించ లేక వరుస ఓటములతో సతమతమవుతున్నాడు.


 ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై స్పందించిన మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ లాగానే రోహిత్ శర్మ కూడా ఐపీఎల్ కెప్టెన్సీ వదిలేస్తాడు అని అనుకున్నాను అంటూ సంజయ్ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు. టీమిండియా కెప్టెన్ కాకముందు రోహిత్ ఐపీఎల్ లో విజయవంతమైన కెప్టెన్గా ఉన్నాడు. ఐదుసార్లు ముంబైని ఛాంపియన్గా నిలిపాడు. కానీ టీమిండియా కెప్టెన్సీ అనే పదం రోహిత్ ని ఒత్తిడి లోకి నెట్టింది. ఇప్పుడు ఐపీఎల్లో ఇది కనిపిస్తోంది. అందుకే రోహిత్ శర్మ కెప్టెన్సీ వదులుకొని పోలార్డ్ కు కెప్టెన్ ఇస్తే బాగుంటుంది అని సంజయ్ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: