షాకింగ్ : న్యూజిలాండ్ క్రికెటర్ రిటైర్మెంట్?
2010లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టాడు బెన్నెట్. న్యూజిలాండ్ తరపున 19 వన్డేలు, 11 టి20 లు ఒక టెస్ట్ కి బెన్నెట్ ప్రాతినిథ్యం వహించడం గమనార్హం. ఇక మూడు ఫార్మాట్లలో కలిపి కేవలం అతడు 43 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అంతర్జాతీయ స్థాయిలో చెప్పుకోదగ్గ ప్రదర్శన మాత్రం చేయలేకపోయా బెన్నెట్. 2011 వన్డే ప్రపంచకప్ లో న్యూజిలాండ్ జట్టుకు బెన్నెట్ ఎంపిక అయినప్పటికీ గాయం కారణంగా కేవలం బెంచికి మాత్రమే పరిమితం అయ్యాడు. ఇటీవలే తన రిటైర్మెంట్ ప్రకటిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు.
నాకు చిన్న తనం నుంచే క్రికెట్ అంటే మక్కువ. అయితే నేను నా కెరియర్లో ఈ స్థాయికి చేరుకుంటానని కలలో కూడా అనుకోలేదు. నా క్రికెట్ కెరియర్ ఓల్డ్ బాయ్స్ తిమురు క్రికెట్ క్లబ్ నుంచి ప్రారంభమైంది. క్రికెట్ లో నాకు ఇన్నాళ్లు మద్దతుగా నిలిచిన కాంటర్బరీ క్రికెట్ న్యూజిలాండ్ క్రికెట్ కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా న్యూజిలాండ్ జాతీయ జట్టు తరపున ప్రాతినిధ్యం వహించడం నాకు ఎంతో గర్వంగా ఉంది అంటూ బెన్నెట్ సోషల్ మీడియాలో తెలిపాడు.