బిసిసిఐ కొత్త నిబంధన.. అభిమానులకు ఊహించని షాక్?

praveen
సాధారణంగా మైధానంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక స్టేడియంలో ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షిస్తున్న ప్రేక్షకులు ఈలలుగోలలతో  రెచ్చి పోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే  తమ అభిమాన జట్టు గాని అభిమాన ఆటగాడు గాని వికెట్ తీసిన సిక్సర్  ఫోర్ కొట్టిన కూడా ఇక వారి పేరుతో పెద్దగా నినాదాలు చేస్తూ ఉంటారు. ఇక తమదైన శైలిలో సంబరాలు చేసుకుంటూ ఉంటారు అభిమానులు. కొంతమంది అభిమానులు పెద్ద పెద్ద జెండాలను స్టేడియం కి పట్టుకుని వచ్చి సంబరాలు చేసుకునే సమయంలో ఆ జెండాలను అటూ ఇటూ ఊపుతూ తమ అభిమాన ఆటగాళ్ళకు సంఘీభావం తెలుపుతూ ఉంటారన్న విషయం తెలిసిందే.


 ఇక ఇలాంటివి చేస్తూ మ్యాచ్ ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఇక జెండా ఊపడంలో ఒక కిక్ ఉంటుంది అని చెబుతుంటారు అభిమానులు. కానీ ఇకనుంచి అభిమానులందరికీ కూడా ఆ కిక్ లేకుండా పోతుంది అని తెలుస్తోంది. ఇక నుంచి జెండా కర్రలు స్టేడియంలో కనిపించకపోవచ్చు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది మాత్రం నిజమే.  ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి వచ్చే ప్రేక్షకులు ఇకపై జెండాలు తీసుకు రావడానికి వీలు లేదని ఒకవేళ పొరపాటున తీసుకువచ్చిన కూడా పలు ఆంక్షలు అమలులో ఉంటాయని ఇటీవలే బిసిసిఐ షాకింగ్ నిర్ణయం తీసుకుంది.

అయితే జెండాల కోసం పెట్టిన కర్రలతో స్టేడియంలోని వారిపై దాడి చేసేందుకు అవకాశం ఉంటుందని ఆర్థిక మైదానంలో వాటిని విసిరేసే ప్రమాదం కూడా ఉందని బిసిసిఐ వివరణ ఇచ్చింది. ఇలాంటి చర్యల వల్ల ప్రేక్షకులు లేదా ఆటగాళ్లకు గాయం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసిన బీసీసీఐ ముందు జాగ్రత్త చర్యగా జెండాలను స్టేడియంలోకి అనుమతించడం లేదు అంటూ స్పష్టం చేసింది. 2022 ఐపీఎల్ సీజన్ ముగిసే వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుందని తెలిపింది. దీంతో అభిమానులు అందరూ షాక్ అవుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: