ఓ క్రికెటర్ తాగి.. నన్ను చంపబోయాడు : చాహల్

praveen
భారత క్రికెట్లో కీలక స్పిన్నర్ గా కొనసాగుతున్న  చాహల్ ఇక మొన్నటివరకు  ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడాడు అన్న విషయం తెలిసిందే. ఇటీవలే మెగా వేలంలో అతన్ని బెంగళూరు జట్టు వదిలేయడంతో చివరికి పోటీపడి మరి రాజస్థాన్ రాయల్స్ జట్టు కొనుగోలు చేసింది.  ఇక రాజస్థాన్ రాయల్స్ తరఫున ప్రస్తుతం అద్భుతంగా రాణిస్తూ తన స్పిన్ మాయాజాలంతో అద్భుతం సృష్టిస్తున్నాడు చాహల్. అయితే ఇటీవలే రవిచంద్రన్ అశ్విన్ తో జరిగిన ఓ ఇంటర్వ్యూలో చాహల్ ఎవరికీ తెలియని ఒక భయానకమైన విషయాన్ని పంచుకున్నాడు.


 2013 సీజన్ సమయంలో ఒక క్రికెటర్ తాగిన మైకం లో తనను పదిహేనవ అంతస్తు నుంచి వేలాడదీశాడు అంటూ చెప్పుకొచ్చాడు చాహల్. అయితే ఆ క్రికెటర్ ఎవరు అన్నది మాత్రం బయటపెట్టలేదు. ఈ విషయాన్ని నేను ఇప్పటి వరకు ఎవ్వరికీ చెప్పలేదు.. ఇకపై అందరికీ తెలిసిపోతుంది అంటూ మొదలు పెట్టిన చాహల్.. 2013లో నేను ముంబై తరఫున ఆడుతున్నాను. ఇక బెంగుళూరులో మేము ఒక మ్యాచ్ గెలిచిన తర్వాత పార్టీ చేసుకున్నాం.. ఈ క్రమంలోనే  ఒక క్రికెటర్ తాగిన మైకం లో ఉన్నాడు. నన్ను చాలా సేపు గమనించి తన వద్దకు రమ్మని పిలిచాడు. ఎందుకు పిలిచాడా అని అతని దగ్గరికి వెళ్లాను. దీంతో నన్ను ఎత్తుకుని ఏకంగా 15 వ అంతస్తు నుంచి వేలాడదీశాడు. ఇక అప్పుడు నా చేతులు అతడి మెడని బిగ్గరగా పట్టుకొని ఉన్నాయి. ఏమాత్రం చేతులు సడలిన  పడిపోవడమే.


 ఇక ఆ సమయంలో పక్కనే ఉన్న ఆటగాళ్లు వెంటనే స్పందించడంతో చివరికి బ్రతికి పోయాను. లేదంటే ప్రాణాలు గాల్లో కలిసి పోయేది ఇక ఆ సమయంలో కళ్లు తిరిగి ఎంతగానో భయమేసింది. ఇక ఆ ఒక్క సంఘటన తో ఎక్కడికైనా వెళ్లిన సమయంలో ఎలా ఉండాలి అన్న విషయం తెలిసొచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక నేను త్రుటిలో చావు నుంచి బయటపడ్డాను. ఆ సమయంలో ఏ చిన్న తప్పు జరిగినా ఇక ప్రాణాలతో ఉండేవాడిని కాదు.. ముందు ఇలా మాట్లాడే వాడిని కాదు అంటూ చాహల్ చెప్పుకొచ్చాడు. దీంతో ఆ క్రికెటర్ ఎవరో చెప్పాలంటూ నెటిజన్లు సామాజిక మాధ్యమాల వేదిక కోరుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: