నా జీవితంలో అదే కీలక మలుపు : రిషబ్ పంత్

praveen
ధోని వారసుడిగా భారత క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్ ఇక తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నాడు. దీంతో రిషబ్ పంత్ ఆటతీరుపై అటు మొదట్లోనే ఎన్నో అంచనాలు కూడా పెరిగిపోయాయి.  అయితే కొన్నాళ్ళ వరకు అంచనాలకు మించి రాణించాడూ రిషబ్ పంత్. ఇక ఆ తర్వాత పేలవా ప్రదర్శనతో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు. అటు బిసిసిఐ ఎన్ని అవకాశాలు వచ్చినప్పటికీ ఫామ్ కోల్పోయి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాడూ. ఇక ఇప్పుడు మాత్రం అత్యుత్తమ ఫామ్ లో కొనసాగుతూ అదరగొడుతున్నాడు అని చెప్పాలి. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన తన కెరియర్ లో కీలక మలుపు అంటూ చెబుతున్నాడు ఈ వికెట్ కీపర్ కం బ్యాట్స్మెన్.


 2020 - 21 లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. అయితే మొదటి టెస్టుల్లో ఘోర పరాభవం ఎదురైంది. ఇక అంతే కాదు కీలక ఆటగాళ్లు గైర్హాజరు కూడా జట్టును ఎంతగానో వేధించింది. ఇలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో అద్భుత విజయాలు సాధించింది టీమిండియా. ఇక ఈ విజయంలో రిషబ్ పంత్ పాత్ర ఎంతో గొప్పది అని చెప్పాలి. అయితే ఈ పర్యటనకు ముందు ఫామ్ కోల్పోయి తెగ ఇబ్బందులు పడ్డాడు. ప్రపంచ కప్ లో కూడా అతనికి చోటు దక్కలేదు. ఇకపోతే తన పేలవమైన ఫామ్ గురించి మహిళా క్రికెటర్ జెర్మియా రోడ్రిక్స్ తో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడాడూ రిషబ్ పంత్.


 ప్రపంచకప్లో నాకు చోటు దక్కని సమయంలో ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉండిపోయాను. కుటుంబ సభ్యులు స్నేహితులతో మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదు. ఇక నాతో నేను ఒంటరిగా ఉంటూ ఆటలో ఇప్పటి నుంచి 100 శాతం కాదు 200 శాతం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. అప్పటికి నా వయసు కేవలం 23 ఏళ్లు మాత్రమే ఇక రెండు ఫార్మాట్లలో చోటు కోల్పోయిన తనకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అందరు నీ వల్ల కాదు అంటూ విమర్శలు చేస్తున్నారు.  ఒంటరిగా నేనేంటో నాకు తెలుసు కోవడానికి ప్రయత్నించా.. సిడ్నీలో జరిగిన టెస్టులో కీలక ఆటగాళ్లు దూరం కావడంతో నాకు అవకాశం వచ్చింది.



 ఇక  97 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటం ఇప్పటికీ గుర్తుంది. ఇక మ్యాచ్ గెలిచే స్థితికి వచ్చిన సమయంలో నేను ఔట్ అయ్యాను. సెంచరీ చేయకపోవడం అంటే మ్యాచ్ గెలిపించ లేకపోవడం ఎంతగానో బాధించింది. నా మొత్తం కెరీర్లో ఆస్ట్రేలియా పర్యటనలో నా ఇన్నింగ్స్ కీలక మలుపు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అంటూ చెప్పుకొచ్చాడు రిషబ్ పంత్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: