రాజస్తాన్ దూకుడుకు బెంగుళూరు కళ్లెం వేస్తుందా?

VAMSI
ఐపీఎల్ 15 సీజన్ స్టార్ట్ అయి అప్పుడే 12 మ్యాచ్ లు పూర్తి అయ్యాయి. నేడు ముంబై లోనే వాంఖడే స్టేడియం లో రాజస్తాన్ రాయల్స్ మరియు రాయల్ ఛాలంజెర్స్ బెంగుళూరు జట్ల మధ్య 13 వ మ్యాచ్ జరగనుంది. ఈ లీగ్ లో రెండు జట్లు కూడా రెండు మ్యాచ్ లను పూర్తి చేసుకున్నాయి. ఈ రోజు జరగబోయేది మూడవ మ్యాచ్. కానీ రాజస్తాన్ రాయల్స్ మాత్రం రెండు వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉంది. మరో వైపు కొత్త కెప్టెన్ ఫాఫ్ డుప్లిసిస్ సారధ్యంలో ఆడిన రెండు మ్యాచ్ లలో ఒకటి గెలిచి మరొకటి ఓడిపోయి పాయింట్ల పట్టికలో అయిదవ స్థానంలో నిలిచింది. కానీ ప్రదర్శన పరంగా బెంగుళూరు ఇప్పటి వరకు ఔరా అనిపించింది.

అయితే వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న శాంసన్ సేనను బెంగుళూరు ఏ మేరకు అడ్డుకుంటుంది అన్నది చూడాల్సి ఉంది. కానీ టాస్ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవడానికి మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. రాజస్థాన్ పై బెంగుళూరు గెలవాలంటే ఖచ్చితంగా బట్లర్, శాంసన్ లను బ్యాటింగ్ లో అదే విధంగా చాహల్, ప్రసిద్ధ కృష్ణ లను బౌలింగ్ లో అడ్డు కోకుంటే బెంగుళూరుకు మరో పరాజయం తప్పదు. ముఖ్యంగా పవర్ ప్లే ను లక్ష్యంగా చేసుకుని విద్వంసాన్ని సృష్టించడంలో బట్లర్ మేటి.

కాబట్టి బెంగుళూరు ఒక ప్రణాళిక ప్రకారం బ్యాట్స్మన్ కి తగిన విధంగా బౌలింగ్ మార్పులు చేసుకుంటూ ఆడితే బలమైన రాజస్థాన్ ను నిలువరించే అవకాశం ఉంది. ఇక ఎప్పటిలాగే డుప్లిసిస్, కోహ్లీ, దినేష్ కార్తీక్ లు రాణిస్తే బెంగుళూరు కు తిరుగు ఉండదు. అలాగే బౌలింగ్ లో వనిందు హాసరంగ, హర్షల్ పటేల్ లు నిలకడగా బౌలింగ్ లో రాణించాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: