"సన్ రైజర్స్ హైద్రాబాద్" సమస్య ఏంటి... ఎందుకీ తడబాటు ?

VAMSI
ఐపీఎల్ చరిత్రలో 14 సీజన్ లు పూర్తి చేసుకుని 15 వ సీజన్ లోకి అడుగుపెట్టాము. గత సంవత్సరం వరకు మొత్తం ఎనిమిది జట్లు పోటీలో ఉండగా అందులో కేవలం బెంగుళూరు, పంజాబ్ మరియు ఢిల్లీ జట్లు ఇప్పటి వరకు టైటిల్ సాధించలేకపోయాయి. అందుకే ఈ సారి ఎలాగయినా టైటిల్ ను కొట్టాలని కసిగా ఉన్నాయి. ఇక ఒక్క సారి టైటిల్ కొట్టిన జట్లుగా సన్ రైజర్స్ హైద్రాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్ లు ఉన్నాయి. రెండవ సారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడానికి వీరు వెయిట్ చేస్తున్నారు. ఐపీఎల్ 15 సీజన్ లో పాల్గొన్న పది జట్లలో 8 జట్లు పాయింట్ల పట్టికలో బోణీ చేయగా, కేవలం రెండు జట్లు మాత్రమే ఇంకా మొదటి విజయం కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి.

అందులో డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మరియు సన్ రైజర్స్ హైద్రాబాద్ లు ఉన్నాయి. గత రాత్రి సన్ రైజర్స్ మరియు లక్నో జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే మొదటి మ్యాచ్ లో కన్నా ఈ మ్యాచ్ లో కేన్ విలియమ్సన్ సేన బాగా రాణించింది. ఫామ్ లో ఉన్న లక్నో జట్టును 170 పరుగులకు కట్టడి చేసి ఖచితముగా గెలుస్తుంది అనిపించింది. కానీ ఆఖరి 4 ఓవర్ లలో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఓవర్ కు పది పరుగులు చేయాల్సి ఉండగా అనవసర షాట్ లకు పోయి మ్యాచ్ ను లక్నో కు అప్పగించింది.

అనుభవజ్ఞులు అయిన ప్లేయర్స్ జట్టులో ఉన్నా కూడా ఎందుకు సన్ రైజర్స్ ఇలా విఫలం అవుతోంది. అసలు వీరి సమస్య ఏమిటి అంటూ హైద్రాబాద్ అభిమానులు తలలు గోక్కుంటున్నారు. చేతుల్లోకి వచ్చిన మ్యాచ్ ను కూడా ఓడిపోవడం ఏమిటో అసలు అర్ధం కావడం లేదు. అయితే ప్రస్తుతం ఉన్న జట్లను చూస్తే అన్నింటికన్నా సన్ రైజర్స్ హైదరాబాద్ బలహీనంగా కనిపిస్తోంది. ఈ ఫ్రాంచైజీతో మురళీధరన్, డేల్ స్టెయిన్, లారా, టామ్ మూడి లాంటి దిగ్గజాలు ఉన్నా జట్టును విజయాల బాట పట్టించలేకున్నారు. మరి ముందు ముందు అయినా మారుతుందా చూడాలి. జాటుట్ కోచ్ టామ్ మూడు జట్టు బలాలు మరియు బలహీనతలు ఏమిటో తెల్సుకుని వాటిని ఏ విధంగా వాడుకోవాలో ఆలోచిస్తే ప్రయోజనం ఉంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: