సూపర్ మ్యాన్ లా ధోని.. వైరల్ వీడియో?
మెరుపువేగంతో మహేంద్రసింగ్ ధోని చేసే స్టంప్ అవుట్ కొన్ని కొన్ని సార్లు అటు అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తాయి అని చెప్పాలి. అందుకే మహేంద్రసింగ్ ధోని వికెట్లు వెనకాల ఉన్నాడు అంటే చాలు ఇక బ్యాట్స్మెన్లు అందరూ కూడా ఎంతో జాగ్రత్తగా ఆచితూచి బ్యాటింగ్ చేయడం లాంటివి చూస్తూ ఉంటాం. కొన్ని కొన్ని సార్లు అనూహ్యమైన రీతిలో ఎవరికీ సాధ్యం కాని విధంగా స్టంప్ అవుట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటాడూ మహేంద్రసింగ్ ధోని. మరోసారి ఇలాంటి రనౌట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు.. ఏకంగా సూపర్ మాన్ లాగా గాల్లోకి ఎగిరి స్టంప్ అవుట్ చేయడం గమనార్హం. ఇటీవలే ఐపీఎల్ లో భాగంగా పంజాబ్ చెన్నై మధ్య జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టులో కొనసాగుతోన్న ధోని చేసిన ఒక రనౌట్ పై ప్రస్తుతం ప్రశంసలు కురుస్తున్నాయి.
జోర్దాన్ వేసిన బంతిని పంజాబ్ బ్యాట్స్మెన్ రాజకప్ప కొట్టి రన్ తీసేందుకు పరుగులు పెట్టాడు. అయితే నాన్ స్ట్రైకర్ బ్యాట్స్మెన్ ఆగిపోవడంతో రాజ కప్ప తిరిగి క్రీజులోకి వచ్చేందుకు యత్నించాడు. ఇక ఇంతలోనే జోర్దాన్ విసిరిన బంతిని అందుకని ఇక ధోనీ వికెట్లను ఔట్ చేసి పెవిలియన్ పంపించాడు. దీంతో మహేంద్రసింగ్ ధోని సూపర్ మాన్ అంటూ నెటిజన్లు కామెంట్లో చేస్తూ ఉండడం గమనార్హం. ఇక ఈ వీడియో కాస్త నెట్ లో చక్కర్లు కొడుతూ ఉండడంతో ఇది చూసిన అభిమానులు అందరూ ధోని లో ఏజ్ పెరిగిన వేగం ఏమాత్రం తగ్గలేదు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు..